BSNL 5G Phone: వావ్.. BSNL నుంచి 5G స్మార్ట్‌ఫోన్.. 200 MP కెమెరాతో రచ్చ రచ్చే..?
BSNL 5G Phone: టెలికాం కంపెనీ BSNL 200 MP కెమెరాతో 5జీ ఫోన్ లాంచ్ చేస్తుందని న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది.
BSNL 5G Phone: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియాతో సహా భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీలు జూలై 2024లో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచినప్పుడు, ప్రజలు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNLని ప్రజలు గుర్తుంచడం ప్రారంభించారు. పెరిగిన టారిఫ్‌ల కారణంగా, వినియోగదారుల జేబులపై పెద్ద ప్రభావం పడింది. ఇప్పటివరకు లక్షల మంది వినియోగదారులు Jio, Airtel, Vi వంటి కంపెనీలను విడిచిపెట్టి BSNLకి మారారు.
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ఈ అవకాశాన్ని తనకు ఒక సువర్ణావకాశంగా తీసుకుంది. ఓ వైపు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఖరీదైన ప్లాన్లను ప్రజలకు విక్రయిస్తుంటే మరోవైపు బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇది మాత్రమే కాదు BSNL తన 4G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించడంలో బిజీగా ఉంది. వీలైనంత త్వరగా BSNL 5Gని ప్రారంభించేందుకు కూడా కృషి చేస్తోంది. ఇదొక్కటే కాదు భారత ప్రధాని నరేంద్ర మోడీ, టెలికాం మంత్రి కూడా BSNL విస్తరణ కోసం ఎప్పటికప్పుడు తమ ఆసక్తిని చూపుతున్నారు.
దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఈరోజుల్లో సోషల్ మీడియాలో బీఎస్‌ఎన్‌ఎల్ గురించి కొన్ని పుకార్లు వ్యాపించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ పుకార్లలో ఒకటి BSNL తన 5G ఫోన్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ అలాగే BSNLసూపర్‌ఫాస్ట్ 5G కనెక్టివిటీ ఉంటుంది.
BSNL5G ఫోన్ రూమర్‌కు సంబంధించి BSNL ముందుకు వచ్చి ఈ ఘటనపై క్లాలిటీ ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వ టెలికాం సంస్థ తన అధికారిక X హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసి ద్వారా ఇటువంటి పుకార్లకు ముగింపు పలికింది. బిఎస్‌ఎన్‌ఎల్ ఫేక్ న్యూస్ ట్రాప్‌లో పడవద్దని, బిఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ నుండి నిజమైన వార్తలను తెలుసుకోవాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
మొత్తంమీద, BSNL 5G లేదా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఏ ఫోన్‌ను విడుదల చేయడం లేదని BSNL ఈ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. ఇది ఇంటర్నెట్ ప్రపంచంలో వ్యాపిస్తున్న పుకార్ మాత్రమే. అయితే, BSNL తన 4G, 5G నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించడానికి చాలా వేగంగా పనిచేస్తుంది. ఆగస్టు 15న 4జీ సేవలను ప్రారంభించనుంది.
Don't fall for #FakeNews! 🚫
— BSNL India (@BSNLCorporate) August 9, 2024
Get real updates from our official website https://t.co/kvXWJQYHLt#BSNL #FactCheck #FakeNewsAlert pic.twitter.com/NuEKzkXGeH
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire