MeeSeva Mobile App: తెలంగాణ ప్రజలకు లక్కీ ఛాన్స్.. ఇక ఆ పనులన్నీ మీ ఫోన్ లోనే చేసుకోవచ్చు..!

Telangana Government Introduced Meeseva Mobile App Click Here for Full Details
x

MeeSeva Mobile App: తెలంగాణ ప్రజలకు లక్కీ ఛాన్స్.. ఇక ఆ పనులన్నీ మీ ఫోన్ లోనే చేసుకోవచ్చు..!

Highlights

MeeSeva Mobile App: వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోంది.

MeeSeva Mobile App: వినూత్న నిర్ణయాలు, పథకాల అమలుతో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో తాజాగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్త మొబైల్ యాప్ ను ఆవిష్కరించనుంది. మీసేవ మొబైల్ యాప్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మీసేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాప్ తో.. ప్రజలకు ఇంటి వద్ద నుంచే పౌర సేవలు పొందే అవకాశం కల్పించారు.

ఈ యాప్ సహాయంతో ఇంటి నుంచే 150 రకాల పౌరసేవలను పొందే అవకాశం కల్పించారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన మెట్రో స్టేషన్లు, షాపింగ్‌మాల్స్, సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ ద్వారా ప్రజలు పౌరసేవలు అందిస్తారు. ఇదిలా ఉంటే మీసేవలో ప్రభుత్వం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. టూరిజం హోటల్స్, ప్యాకేజీల బుకింగ్, దివ్యాంగుల గుర్తింపు కార్డులు, వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ, సదరం సర్టిఫికెట్ల జారీ, పర్మిట్ల రెన్యూవల్, కొత్తవి జారీ చేయటం, వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు, తరలించేందుకు అనుమతులు వంటి సేవలన్నీ స్మార్ట్ ఫోన్ లోనే పొందొచ్చు. దీంతో ప్రజలు ఇకపై పనుల గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టీఫైబర్‌ పైలట్‌ ప్రాజెక్టు కింద తెలంగాణలోని మూడు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్‌టీవీ సేవలతో కూడిన బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందించనుంది. తొలుత అడవి శ్రీరాంపూర్ ( పెద్దపల్లి జిల్లా), సంగుపేట (సంగారెడ్డి జిల్లా), మద్దూర్‌ (నారాయణపేట జిల్లా)లలో ఈ సేవలు ప్రారంభించనున్నారు. కేవలం నెలకు రూ. 300 తోనే ఈ సేవలు అందించనున్నారు. 20 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందించనుంది. తెలుగు ఓటీటీలు కూడా వీక్షించే అవకాశం కల్పించనున్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories