Tecno Pop 9 5G: అదిరిపోయే ఆఫర్.. రూ. 9,999కే 5G స్మార్ట్‌ఫోన్

Tecno Pop 9 5G: అదిరిపోయే ఆఫర్.. రూ. 9,999కే 5G స్మార్ట్‌ఫోన్
x
Highlights

Tecno Pop 9 5G: టెక్నో గత ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో టెక్నో పాప్ 9 5G ని ప్రారంభించింది. కంపెనీ దీనిని 4GB RAMతో 64GB / 128GB అనే రెండు స్టోరేజ్...

Tecno Pop 9 5G: టెక్నో గత ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో టెక్నో పాప్ 9 5G ని ప్రారంభించింది. కంపెనీ దీనిని 4GB RAMతో 64GB / 128GB అనే రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ భారీ ర్యామ్ వేరియంట్‌ను తీసుకువస్తోంది. పెరిగిన RAM కాకుండా, ఫోన్‌లో అన్ని ఇతర ఫీచర్లు అలాగే ఉంటాయి. కొత్త వేరియంట్‌లో 16GB RAM అందుబాటులో ఉంటుంది. మీరు తక్కువ ధరలో భారీ ర్యామ్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది మీకు సరైన ఎంపిక. ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX582 సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కొత్త వేరియంట్ 8GB RAM తో వస్తుంది. మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా అదనపు 8GB కోసం సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తం RAMని 16GBకి తీసుకువెళుతుంది. కొత్త వేరియంట్‌లో 128GB స్టోరేజ్ ఉంటుంది. అమెజాన్‌లో లైవ్ అవుతుంది. ఇందులో ఫోన్ ధర రూ. 10,999 గా ఉంది. జనవరి 8 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. గతంలో ఇది 4GB RAMతో ప్రారంభించారు. దీని ప్రస్తుత ధర 4GB + 64GB వేరియంట్ రూ. 9,499 , 4GB + 128GB వేరియంట్ ధర రూ. 9,999. ఇది మిడ్‌నైట్ షాడో, అరోరా క్లౌడ్, అజూర్ స్కై అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

Tecno Pop 9 5G Specifications - టెక్నో పాప్ 9 5G స్పెసిఫికేషన్స్

ఫోన్ సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో LCD డిస్‌ప్లేతో వస్తోంది. డిస్‌ప్లే సైజు గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఫోన్ MediaTek Dimension 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఫోన్ కొత్త వేరియంట్ వర్చువల్ ర్యామ్‌తో మొత్తం 16GB RAM + 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఫోన్‌లో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్ ఉంది. దీనిలో LED ఫ్లాష్‌తో రెండు వెనుక కెమెరాలు ఉన్నాయి. ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది సోనీ IMX582 సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి.

ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్ డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్డ్‌గా ఉండటానికి IP54 రేటింగ్‌తో వస్తుంది. దీనికి ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ సపోర్ట్ ఉంది. దీని ద్వారా ఫోన్‌ను రిమోట్‌గా ఉపయోగించి ఇంట్లో స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం ఫోన్‌లో NFC సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories