Tecno Pop 9 Launch: డెడ్ చీప్‌గా 'టెక్నో పాప్‌ 9'.. స్టన్నింగ్‌ ఫీచర్స్‌ ఇవే..!

Tecno Pop 9 4G to Launch on November 22 in India
x

Tecno Pop 9 Launch: డెడ్ చీప్‌గా 'టెక్నో పాప్‌ 9'.. స్టన్నింగ్‌ ఫీచర్స్‌ ఇవే..!

Highlights

Tecno Pop 9 Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ 'టెక్నో' బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది.

Tecno Pop 9 Launch: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ 'టెక్నో' బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్దమైంది. తన పాప్‌ సిరీస్‌లో భాగంగా 'టెక్నో పాప్‌ 9' పేరుతో రిలీజ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. పాప్ 9 4జీ ఫోన్‌ను నవంబర్ 22న లాంచ్ చేస్తున్నట్లు టెక్నో పేర్కొంది. 2024 సెప్టెంబర్‌లో పాప్ 9 5జీని రిలీజ్ చేసిన టెక్నో.. అదే ఫోన్‌ను ఇప్పుడు బడ్జెట్‌ ధరలో 4జీలో తీసుకొస్తోంది.

టెక్నో పాప్ 9 స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ ర్యామ్ +64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.9,499గా ఉండనుంది. 4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.9,999గా ఉండనున్నట్లు తెలుస్తోంది. మైక్రో ఎస్‌డీ కార్డు సాయంతో ఇంటర్నల్ స్టోరేజీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్, స్టార్‌ట్రైల్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఎంపికలో పాప్ 9 అందుబాటులో ఉంటుంది. టీజర్ చూస్తే.. 5జీ మాదిరిగానే ఈ 4జీ ఫోన్‌ లుక్ ఉంది. భారతీయ మార్కెట్లో మీడియాటెక్ జీ50 ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ పేర్కొంది.

టెక్నో పాప్ 9లో పంచ్‌ హోల్‌ డిజైన్‌ డిస్‌ప్లేను ఇ్వవనున్నారు. 6.67 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌, 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ను ఇందులో ఇవ్వనున్నారు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా.. 15 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇస్తున్నారు. ఐఆర్ రిమోట్ కంట్రోల్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వేదికగా ఈ ఫోన్‌ అమ్మకాలు అందుబాటులో ఉండనున్నాయి. టెక్నో పాప్ 9 ఫుల్ డీటెయిల్స్ నవంబర్ 22న తెలియరానున్నాయి.

టెక్నో పాప్ 9 ఫీచర్స్:

# 6.67 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్‌

# 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్

# ఐపీ54 రేటింగ్‌

# మీడియాటెక్ జీ50 ప్రాసెసర్‌

# 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా

# 5,000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

Show Full Article
Print Article
Next Story
More Stories