Cheapest 5G Phone Launched: రూ.8,499లకే 5జీ ఫోన్.. కెవ్ అనిపిస్తున్న డాల్బీ అట్మోస్, ఏఐ ఫీచర్లు.. టెక్నో ఇచ్చిపడేసింది..!

Tecno Pop 9 5G
x

Tecno Pop 9 5G

Highlights

Cheapest 5G Phone Launched: టెక్నో తన చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Pop 9 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీన్ని రూ.8,499లతో కొనుగోలు చేయవచ్చు.

Cheapest 5G Phone Launched:చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో తన చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ Tecno Pop 9 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవడానికి ముందు ఈ ఫోన్ లాంచ్ అయింది. కస్టమర్‌లు వచ్చే నెలలో ప్రత్యేక తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. కొత్త ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, డైనమిక్ పోర్ట్, 48MP AI కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఇది తక్కువ ధరలో ప్రీమియం లుక్ అనుభూతిని అందిస్తుంది.

కొత్త స్మార్ట్‌ఫోన్ ధర తక్కువగా ఉన్నప్పటికీ దీనికి స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌‌లో ఫోన్ రన్ అవుతుంది. ఇది 4GB ఇన్‌స్టాల్ చేసిన RAMతో వస్తుంది. అలానే 4GB వర్చువల్ RAM సపోర్ట్‌తో RAM 8GB వరకు పెంచుకోవచ్చు. ఇందులో 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ఫోన్ నాలుగు సంవత్సరాలకు పైగా లాగ్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Tecno Pop 9 5G Specifications
టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో AI ఫీచర్లతో 48MP Sony IMX582 కెమెరా సెన్సార్ ఉంది. ఇది కాకుండా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సేఫ్టీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఉంది. ఈ ఫోన్ IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ని అందిస్తుంది. దీని 5000mAh కెపాసిటీ బ్యాటరీ 18W ఛార్జింగ్‌‌కు సపోర్ట్ ఇస్తుంది.

టెక్నో ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.9,499గా ఉంది. అదే సమయంలో 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన మోడల్‌ను రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 7 నుండి అమెజాన్‌లో సేల్ ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్ తర్వాత రూ. 1000 తగ్గింపు కారణంగా దీనిని రూ. 8,499 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ మిడ్‌నైట్ షాడో, అజూర్ స్కై, అరోరా క్లౌడ్ కలర్స్‌లో వస్తుంది. అలానే రెండు అదనపు బ్యాక్ ప్యానెల్ స్కిన్‌లు కూడా బాక్స్‌లో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories