Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు వచ్చేశాయ్‌.. ఎలా ఉపయోగించుకోవాలంటే..

Swiggy introduced its own UPI payments, know about how to activate it
x

Swiggy: స్విగ్గీలో యూపీఐ సేవలు వచ్చేశాయ్‌.. ఎలా ఉపయోగించుకోవాలంటే..

Highlights

ఇకపై స్విగ్గీ ఫ్లాట్‌ఫామ్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వారు పేమెంట్స్‌ కోసం ఇతర యాప్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా స్విగ్గీ యాప్‌ ద్వారానే పేమెంట్స్‌ చేసుకోవచ్చు.

Swiggy: ప్రస్తుతం యూపీఐ సేవలకు భారీగా ఆదరణ పెరుగుతోన్న విషయం తెలిసిందే. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద దుకాణాల వరకూ అన్నీ డిజిటల్‌ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్స్‌ వినియోగం భారీగా పెరగడంతో కూడా డిజిటల్‌ చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లోకి డిజిటల్‌ చెల్లింపు యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు సొంతంగా యూపీఐ సేవలను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రొడక్ట్స్‌ కొనుగోలు చేసే వారు నేరుగా వీటిలో నుంచే పేమెంట్స్‌ చేసుకునే విధంగా యూపీఐ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం యూపీఐ సేవలను ఫుడ్ డెలివరీ యాప్స్‌ సైతం అందిస్తున్నాయి. ఇప్పికే జొమాటో యూపీఐ సేవలను ప్రారంభించగా తాజాగా.. మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ సైతం తమ అప్లికేషన్‌ వేదికగా యూపీఐ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ బుధవారం అధికారికంగా ప్రకటించింది.

ఇకపై స్విగ్గీ ఫ్లాట్‌ఫామ్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకునే వారు పేమెంట్స్‌ కోసం ఇతర యాప్స్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకుండా నేరుగా స్విగ్గీ యాప్‌ ద్వారానే పేమెంట్స్‌ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ ప్రక్రియను మరింత సులభంగా, వేగంగా మార్చడం కోసం ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు స్విగ్ అధినేత అనురాగ్‌ రెడ్నెస్‌ తెలిపారు. ఈ సేవలను ఉపయోగించుకోవాలంటే ముందుగా యూపీఐ సేవలను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇందుకోసం ముందుగా స్విగ్గీ యాప్‌లోకి వెళ్లాలి. అనంతరం యాప్‌లో ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అందులోని పేమెంట్స్‌ పేజీకి వెళ్లగానే బ్యాంక్‌ లింక్డ్‌ యూపీఐ అకౌంట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డ్స్‌ వంటి పేమెంట్స్‌ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులోనే.. 'స్విగ్గీ యూపీఐ' పేమెంట్‌ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకొని.. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఓటీపీ సాయంతో వెరిఫై చేసి, బ్యాంక్‌ ఖాతాను లింక్‌ చేయాలి. దీంతో మీ యూపీఐ పిన్‌ సాయంతో సులభంగా పేమెంట్స్‌ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories