Chandrayaan 3 Mission: చంద్రయాన్-3లో GPS లేదు.. మరి చంద్రుని మార్గాన్ని ఎలా చేరుకుంటుందో తెలుసా?

Sun and Pole Star are Help to Chandrayaan-3 to Reach Moon
x

Chandrayaan 3 Mission: చంద్రయాన్-3లో GPS లేదు.. మరి చంద్రుని మార్గాన్ని ఎలా చేరుకుంటుందో తెలుసా?

Highlights

Moon Mission: చంద్రయాన్-3 విజయవంతంగా ముందుకు సాగుతోంది. జులై 25న కక్ష్య మార్చిన తర్వాత ఆగస్టు 1న మరో కక్ష్య మార్చింది.

Chandrayaan 3 Journey: చంద్రయాన్-3 విజయవంతంగా ముందుకు సాగుతోంది. జులై 25న కక్ష్య మార్చిన తర్వాత ఆగస్టు 1న మరో కక్ష్య మార్చింది. చంద్రయాన్ భూమి కక్ష్య నుంచి బయటకు వచ్చి క్రమంగా చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, చంద్రయాన్-3 ఎలా ముందుకు సాగుతోంది. ఆ దిశలోనే వెళ్లాలి అని ఎలా తెలుసుకుంటుంది. అసలు చంద్రయాన్ దిశను ఎవరు నిర్ణయిస్తారు అంటూ ప్రశ్నలు సామాన్యులకు వస్తున్నాయి. చంద్రయాన్-3 ధ్రువ నక్షత్రం ఆధారంగా ముందుకు సాగుతుందా లేదా మరేదైనా సాంకేతికత సహాయం తీసుకుంటుందా. ప్రస్తుతం భూమికి 71351 x 233 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతోంది.

ధ్రువ నక్షత్రం, సూర్యుడు సహాయం..

చంద్రయాన్-3లో జీపీఎస్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయలేదు. వాస్తవానికి, అంతరిక్షంలో GPS పనిచేయదు. నిజానికి ఏ వ్యోమనౌక అయినా దానికి స్టార్ సెన్సార్లు అటాచ్ అయి ఉంటాయి. చంద్రయాన్-3లో అనేక స్టార్ సెన్సార్లు కూడా జత చేశారు. వాటి సహాయంతో అంతరిక్షంలో ఏ దిశలో, ఏ మార్గంలో వెళ్లాలి అనే సమాచారాన్ని పొందుతుంది. ధ్రువ నక్షత్రం, సూర్యుడు వారి స్థానంలో ఫిక్స్ అయ్యాయని మనకు తెలిసిందే. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంటుంది. దాని ద్వారా మిగిలిన దిశల గురించి సమాచారం అందుతుంది. పగటిపూట సూర్యుని సహాయంతో, రాత్రి ధ్రువ నక్షత్రం సహాయంతో అంతరిక్ష నౌక ముందుకు సాగుతుంది.

చంద్రయాన్ దారిలో..

1 ఆగస్టు చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశిస్తుంది

ఆగస్టు 5 చంద్రయాన్-2 చంద్రుని మొదటి కక్ష్యలో ఉంటుంది

ఆగస్టు 6 చంద్రుని రెండవ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది

ఆగస్టు 9 మూడో కక్ష్యలోకి ప్రవేశిస్తుంది

ఆగస్టు 14 నాల్గవ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది

ఆగస్టు 16 ఐదవ కక్ష్యలోకి ప్రవేశిస్తోంది

ఆగస్టు 17 ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ విడిపోతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories