ఎండాకాలం మరో బ్యాడ్‌న్యూస్.. ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరిగే అవకాశాలు..!

Summer is Another bad News ACs Fridge Prices are Likely to Increase
x

ఎండాకాలం మరో బ్యాడ్‌న్యూస్.. ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు పెరిగే అవకాశాలు..!

Highlights

ACs Fridge Prices: అసలే ఎండలు మండిపోతుంటే మరోవైపు ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు కూడా హీటెక్కిస్తున్నాయి.

ACs Fridge Prices: అసలే ఎండలు మండిపోతుంటే మరోవైపు ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు కూడా హీటెక్కిస్తున్నాయి. పలు కంపెనీల నిర్వాహకులు మరోసారి ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలని పెంచడానికి సిద్దమవుతున్నారు. దీంతో ఈ ఎండాకాలం మరింత ఉక్కపోత తప్పదు. విద్యుత్ కోతలు పెరిగినా, కరెంటు ఛార్జీలు పెరిగినా ఒక ఏసీ కొనాలని అనుకునే వారికి కంపెనీలు షాక్‌ల మీద షాక్‌నిస్తు్నాయి. ఇంధన ధరలు పెరగడం, గ్లోబల్ కాంపోనెంట్స్ కొరత వంటి అనేక కారణాల వల్ల భారతీయ AC తయారీదారులు ధరలను పెంచుతున్నారు. ఈ నెలాఖరు లేదా జూన్‌ మొదటివారంలోనే వీటి ధరలను 3-5 శాతం పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

పెరిగిన ధరలపై ఎలక్ట్రానిక్స్‌ తయారీదార్ల సంఘం సీమా అధ్యక్షుడు ఎరిక్‌ బ్రగాంజా వివరణ ఇస్తూ.. 'ఇప్పటికే ముడి పదార్థాల ధరలు పెరిగాయి. డాలర్‌ విలువ పెరిగిపోవడంతో, దిగుమతి చేసుకుంటున్న విడిభాగాలకు మరింత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అందువల్ల ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ధరలను త్వరలోనే 3-5 శాతం పెంచుతున్నామని తెలిపారు. ప్రధానంగా చైనాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌లు, ముడి సరుకు కొరత, వస్తువుల ధరల ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏర్పడ్డ అనేక పరిస్థితులు ఈ భారానికి కారణమని చెబుతున్నారు.

ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్‌ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. 'ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది' అని పానసోనిక్‌ ఇండియా డివిజనల్‌ డైరెక్టర్‌ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ పన్నసల్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories