Sony WF-C510 Earbuds Launched: చాలా చీపు.. సోనీ నుంచి బడ్జెట్ ఇయర్‌బడ్స్.. సౌండ్ దద్దరిల్లిపోద్ది..!

Sony WF-C510 Earbuds Launched
x

Sony WF-C510 Earbuds Launched

Highlights

Sony WF-C510 Earbuds Launched: సోనీ బడ్జెట్-ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్ WF-C510ని విడుదల చేసింది. లాంచ్ ఆఫర్‌గా రూ.1000 డిస్కౌంట్ అందిస్తుంది.

Sony WF-C510 Earbuds Launched: సోనీ ఇండియా బడ్జెట్-ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్ WF-C510ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ హెడ్‌ఫోన్‌లు మొత్తం 22 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయని కంపెనీ తెలిపింది. వినియోగదారులు Sony Headphone Connect యాప్ ద్వారా బడ్స్‌ను కస్టమైజ్‌డ్ చేయొచ్చు. భారతదేశంలో ఈ బడ్స్ సేల్ సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ లేటెస్ట్ బడ్స్ ధర, ఫీచర్లను ఇప్పుడు తెలుసుకుందాం.

WF-C510 సోనీ DSEE (డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్) టెక్నాలజీతో హై క్వాటలిటీ సౌండ్ అందజేస్తుందని తెలిపింది. ఇది అన్ని ఫ్రీక్వెన్సీలలో ఆడియోను మెరుగుపరుస్తుంది. మరింత లీనమయ్యే ధ్వని అనుభవాన్ని అందించే 360 రియాలిటీ ఆడియోకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇయర్‌బడ్‌లు ఛార్జింగ్ కేస్‌తో సహా 22 గంటల వరకు ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఇది కేవలం 5 నిమిషాల ఛార్జ్‌తో 1 గంట బ్యాటరీని అందిస్తుంది.

దీనిలో యాంబియంట్ సౌండ్ మోడ్‌ కూడా ఉంది. బడ్స్‌లో ఉన్న వాయిస్ ఫోకస్ ఫీచర్ కాల్ క్లారిటీని పెంచుతుంది. ఇయర్‌బడ్‌లను సోనీ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ ద్వారా కస్టమైజ్‌డ్ చేయొచ్చు. దీని ద్వారా EQ సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేయవచ్చు. ఒకే సమయంలో రెండు గ్యాడ్జెట్‌లతో మల్టీపాయింట్ లింక్ చేయడానికి కూడా సపోర్ట్ ఇస్తుంది. IPX4 రేటింగ్‌తో వాటర్ స్ప్లాష్‌లకు రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి.

బ్లూ, ఎల్లో, బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభించే ఈ బడ్స్‌ను కంపెనీ రూ. 3,990 ధరకు ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. విశేషమేమిటంటే, ప్రత్యేక లాంచ్ ధర కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌ల నుండి ఈ బడ్‌లను కొనుగోలు చేయడంపై కంపెనీ రూ. 1000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇది 31 అక్టోబర్ 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక సైట్, సోనీ స్టోర్‌లు, ఇతర ప్రధాన రిటైలర్‌ల నుండి సెప్టెంబర్ 26 నుండి ఈ బడ్‌లను కొనుగోలు చేయగలుగుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories