Tech Tips: స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి..!

Smart phone users should follow these things before downloading mobile apps
x

Tech Tips: స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి.. 

Highlights

Tech Tips: స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్నారా.? ఈ విషయాలు తప్పక గుర్తుపెట్టుకోండి..

Tech Tips: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ చిన్న పనికి చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. ప్రతీ అవసరానికి ఒక యాప్ అందుబాటులోకి వచ్చేశాయ్‌. సినిమా టికెట్‌ నుంచి విమానం టికెట్‌ వరకూ యాప్ ఉండాల్సిందే. ప్రస్తుతం కొన్ని వేల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచితంగా లభిస్తున్నాయి కదా అని ఏ యాప్‌ పడితే ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే మూల్యం చెల్లించక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏదైనా కొత్త యాప్‌ను డౌల్‌డ్‌ చేసుముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏ యాప్‌ కావాలన్నా వీలైనంత ప్లేస్టోర్‌ నుంచే పొందాలి. ఒకవేళ యాపిల్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ కొంతలో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా బ్రౌజర్‌ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకూడదు. వీటిలో కొన్ని ఫేక్‌య యాప్స్‌, అలాగే ఫోన్‌ను హ్యాక్‌ చేస్తే యాప్స్‌ కూడా ఉంటాయి. ప్లేస్టోర్‌లో యాప్స్‌ను యాడ్ చేసే సమయంలో అన్ని రకాల వెరిఫికేషన్‌లు నిర్వహిస్తారు.

* యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసే ముందు సదరు యాప్‌ ఏయే అంశాలకు సంబంధించి యాక్సెస్‌ అడుగుతుందో చూడాలి. కొన్ని యాప్స్‌ మీ కెమెరాను, మైక్రోఫోన్‌ను, స్క్రీన్‌ రికార్డింగ్‌ను కూడా యాక్సెస్‌ అడుగుతాయి. ఇలాంటి చూడకుండా 'అలౌ' నొక్కుతూ వెళ్లిపోతుంటాం. అయితే వీటిని దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు స్క్రీన్‌ రికార్డింగ్‌కు అనుమతి ఇస్తే మీరు ఫోన్‌లో ఏం చేస్తున్నారో మొత్తం అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం ఉంటుంది.

* ఇక కొత్త యాప్‌డౌన్‌లోడ్‌ చేసే ముందు కచ్చితంగా సదరు యాప్‌కి సంబంధించి ప్రైవసీ పాలసీని చదవాలి. యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. మీ ఫోన్‌లో ఏయే వివరాలను యాక్సెస్‌ చేస్తుందో తెలుసుకున్న తర్వాతే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

* మీరు డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌కు సంబంధించి రేటింగ్, రివ్యూలను కచ్చితంగా పరిశీలించాలి. ఒకవేళ సదరు యాప్స్‌లో ఏవైనా పొరపాటులు లేదా ఇబ్బందులు ఉంటే.. అంతకు ముందు డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు రివ్యూలో ఆ విషయాలను ప్రస్తావిస్తారు. అలాగే యాప్‌ రేటింగ్ బాగుంటేనే డౌల్‌లోడ్‌ చేసుకోవడం బెటర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories