భారత యూజర్లకు వాట్సాప్ షాక్.. 1.59 లక్షల ఖాతాలపై నిషేధం

Shock to Indian WhatsApp Users because WhatsApp Banned 1.59 Lakhs WhatsApp Accounts | Technology News
x

భారత యూజర్లకు వాట్సాప్ షాక్.. 1.59 లక్షల ఖాతాలపై నిషేధం

Highlights

WhatsApp: 2021 ఐటీ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వెల్లడి...

WhatsApp: మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది వాట్సాప్. భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్ల ఖాతాలపై నిషేధం విధించింది. నిబంధనలు అనుగుణంగా లేని కారణంగా 1.59 లక్షలకు పైగా ఖాతాలపై బ్యాన్ విధించినట్లు పేర్కొంది. 2021 నవంబర్ నెలకు సంబంధించి యూజర్ల భద్రతా నివేదికను విడుదల చేసింది వాట్సాప్. యూజర్ల ఫిర్యాదు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను ఈ నివేదికలో వెల్లడించింది.

ఎంట్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మేసేజింగ్ సర్వీస్‌లలో దుర్వినియోగాన్ని నిరోధించడంలో వాట్సాప్ ముందంజలో ఉందని తెలిపింది. తమ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగిస్తున్న వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఇతర అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పంది. డేటా సైంటిస్టులు, టెక్నీషియన్లు ఈ పనిలోనే ఉన్నారని పేర్కొంది.

స్పామ్ లేదా దుర్వినియోగం, మోసపూరిత ఖాతాలని భావిస్తే తమకు తెలియజేయాలని యూజర్లను వాట్సాప్ కోరుతుంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో, మెస్సేజ్ చేస్తున్న సమయంలో, నెగెటివ్ ఫీడ్ బ్యాక్‌లకు స్పందించడం ఆధారంగా ఖాతాలను గుర్తించి చర్యలు చేపడుతుంది వాట్సాప్.

Show Full Article
Print Article
Next Story
More Stories