Portable AC : మండే ఎండలకు చిల్లవ్వండి.. ఈ మినీ పోర్టబుల్‌ ఏసీతో ఇంటిని సిమ్లాగా మార్చేయండి.. తక్కువ ధర, కరెంట్‌ బిల్‌ ఆదా..!

SHAALEK Portable Air Conditioner in India for Summer With Rechargable Battery Check Price and Features
x

Portable AC : మండే ఎండలకు చిల్లవ్వండి.. ఈ మినీ పోర్టబుల్‌ ఏసీతో ఇంటిని సిమ్లాగా మార్చేయండి.. తక్కువ ధర, కరెంట్‌ బిల్‌ ఆదా..!

Highlights

Portable Air Cooler: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఇంకా విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది.

Portable Air Cooler: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఇంకా విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. దీంతో ప్రతీ ఇంట్లో కూలర్లు, ఏసీలకు డిమాండ్‌ పెరిగింది. అయితే.. స్ల్పిట్‌, విండో ఎయిర్ కండిషనర్లు కొంచెం ఖరీదుగా కూడుకున్నవి. కానీ పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు మాత్రం చాలా తక్కువ ధరకే మన ఇంటిని చల్లగా మారుస్తుంటాయి.

పోర్టబుల్ ఏసీలతో ఎన్నో ప్రయోజనాలను ఉన్నాయి. వీటిని ఇన్‌స్టలేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ గదిలోనైనా వాడుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చిన్న ఇళ్లు, గదుల్లో నివసించేవారికి ఇవి మంచి ఆప్షన్‌గా మారాయి. సాధారణ ఏసీలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. కరెంట్ వాడకం కూడా చాలా తక్కువ. కరెంట్ చార్జీలు కూడా బాగా తగ్గిస్తాయి. లేటెస్ట్ పోర్టబుల్ ఏసీలు, కూలర్లు ఎన్నో అడ్వాన్డ్స్‌ ఫీచర్లతో వస్తున్నాయి.

SHAALEK పోర్టబుల్ ఎయిర్ కండీషనర్..

ఈ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ మీ ఇల్లు లేదా కార్యాలయాన్ని చల్లబరచడానికి సరైనది. దీనిలో మూడు స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్ అవుట్‌లెట్ దిశను మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది. దీని తక్కువ నాయిస్ ఆపరేషన్ ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. దీని ధర దాదాపు 9 వేల రూపాయలు.

దీని వాడకంతో ఎండనుంచి బయటపడొచ్చు. మనతోపాటు చుట్టు పక్కల వాతావరణాన్ని కూడా చల్లగా చేసుకోవచ్చు. పోర్టబుల్ ఎయిర్ ప్యూర్ చిల్ సిస్టమ్ అనేది మీ చుట్టూ ఉన్న గాలిని తేమగా, చల్లబరుస్తుంది. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మండే వేడిలో కూడా చల్లని గాలిని అందిస్తుంది. AC ఇన్‌స్టాలేషన్, స్పేస్-మిక్సింగ్ కూలర్‌లు అవసరం లేకుండా వినియోగదారులకు సహాయపడుతుంది. ఇది కాంపాక్ట్, మీ గది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories