Samsung Galaxy S24 FE: రాస్కో ఇదే పర్ఫెక్ట్.. ట్రిపుల్ కెమెరాతో సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ ఫోన్..!

Samsung Galaxy S24 FE
x

Samsung Galaxy S24 FE

Highlights

Samsung Galaxy S24 FE: సామ్‌సంగ్ త్వరలో Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఇది BIS ధృవీకరణన పొందింది.

Samsung Galaxy S24 FE: ఈ ఏడాది ప్రారంభం నుంచే టెక్ మార్కెట్‌‌లో అనేక స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే ప్రీమియం సెగ్మెంట్‌ విషయానికి వస్తే సామ్‌సంగ్ ఫోన్లు హైలెట్‌గా నిలిచాయి. అందులో సామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా, గెలాక్సీ ఎస్ 24 వంటి ఫోన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే కంపెనీ మరో ఫోన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ BIS ధృవీకరణన పొందింది. ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లోకి రానుందని లిస్టింగ్ చూపిస్తుంది. ఇంతకుముందు, దాని స్పెసిఫికేషన్‌లు సపోర్ట్ పేజీలు, లీక్‌ల ద్వారా వెల్లడయ్యాయి.

ఈ సామ్‌సంగ్ ఫోన్ BISలో మోడల్ నంబర్ SM-S721B/DSతో లిస్ట్ చేయబడింది. ఇది Samsung సపోర్ట్‌ పేజీలోని మోడల్ నంబర్‌తో సరిపోతుంది. అయితే ధృవీకరణ ఫోన్ హార్డ్‌వేర్ లేదా డిజైన్‌ను వెల్లడించలేదు. కానీ, BIS వెబ్‌సైట్‌ ప్రకారం Galaxy S24 FE త్వరలో లాంచ్ అవుతుంది. కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 2024లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయవచ్చు. రాబోయే ఫోన్ డిజైన్ స్టాండర్డ్ గెలాక్సీ ఎస్24 డిజైన్‌తో సమానంగా ఉంటుంది. ఫోన్ ఐదు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో గ్రీన్, ఎల్లో, గ్రాఫైట్, బ్లూ, వైట్ ఉన్నాయి.

సామ్‌సంగ్ రాబోయే స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో కూడా గుర్తించబడింది. కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Geekbench లీకైన స్పెక్స్ ప్రకారం, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఫోన్ Samsung Exynos 2400e SoCని కలిగి ఉండవచ్చు, Xclipse 940 GPU కనీసం 8GB ర్యామ్‌తో లింకై ఉంటుంది.

కెమెరా వెనుక భాగంలో ట్రిపుల్ లెన్స్ సెటప్‌ను కలిగి ఉండవచ్చు. మెయిన్ సెన్సార్ 50MP షూటర్‌, దానితో పాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 8MP టెలిఫోటో లెన్స్. 10MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఫోన్ 4,565mAh బ్యాటరీతో వస్తుంది. గెలాక్సీ S24 FE సామ్‌సంగ్ వన్ UI 6.1.1 కస్టమైజేషన్‌తో ముందే ఇన్‌స్టాల్ చేయబడిన Android 14తో రన్ అవుతుంది. ఫోన్‌లో అనేక గెలాక్సీ AI ఫీచర్లు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories