Samsung Galaxy S25 5G: సామ్‌సంగ్‌ను కొట్టే దమ్ముందా.. గెలాక్సీ S24 సిరీస్ నుంచి మూడు కొత్త ఫోన్లు.. కెమెరా ఒక రేంజ్‌లో ఉంటుందేమో..!

Samsung Galaxy S25 5G
x

Samsung Galaxy S25 5G

Highlights

Samsung Galaxy S25 5G : సామ్‌సంగ్ త్వరలో గెలాక్సీ S25 5G సిరీస్ నుంచి మూడు ఫోన్లను లాంచ్ చేయనుంది. వీటీలో బెస్ట్ కెమెరా, ఏఐ ఫీచర్లు ఉంటాయి.

Samsung Galaxy S24 5G: టెక్ మార్కెట్‌లో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్లు సందడి చేస్తుంటే.. వాటికి గట్టిపోటీ ఇచ్చేందుకు దక్షిణ కొరియా దిగ్గజం సామసంగ్ సిద్ధమైంది. వరుసగా బడ్జెట్ నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు ఫోన్లను లాంచ్ చేస్తూ పరుగులు పెడుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలో తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ Samsung Galaxy S24ని విడుదల చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లోని అన్ని స్మార్ట్‌ఫోన్‌లను గొప్ప ఫీచర్లతో పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను విస్తరించబోతోంది. ఇప్పుడు Samsung Galaxy S25 5Gని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కంపెనీ అనేక అప్‌గ్రేడ్ ఫీచర్లతో Samsung Galaxy S25 5G సిరీస్‌ను లాంచ్ చేయనుంది. Galaxy S25 సిరీస్ కోసం ఫోటోగ్రఫీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ జాబితాలో ఉంటే రాబోయే సిరీస్ ఇటీవల గుర్తించబడింది. సామ్‌సంగ్ తన NEX ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను త్వరలో మార్కెట్లో విడుదల చేయనుంది. సామ్‌సంగ్ Galaxy S25 సిరీస్‌లో వస్తున్న మొదటి One UI 7 ను కంపెనీ టెస్టింగ్ కోసం Samsung OTA సర్వర్‌కు అప్‌లోడ్ చేసిందని కొన్ని లీక్స్ నివేదికలలో వెల్లడైంది. సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లోని అన్ని స్మార్ట్‌ఫోన్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కంపెనీ అప్‌డేట్ చేయనుంది.

Gizmo చైనా నివేదిక ప్రకారం Samsung Galaxy S25 5G ఇటీవల IMEI డేటాబేస్‌లో గుర్తించబడింది. IMEI డేటాబేస్ నుండి అందుకున్న సమాచారం ఆధారంగా Samsung రాబోయే సిరీస్‌లో గెలాక్సీ S25, Galaxy S25+, Galaxy S25 Ultra వంటి 3 స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయి. ఈ అన్ని స్మార్ట్‌ఫోన్‌ల మోడల్ నంబర్‌లు కూడా IMEI డేటాబేస్‌లో లిస్ట్ అయింది. OTA సర్వర్‌లో గుర్తించబడిన తర్వాత రాబోయే సిరీస్‌లో కంపెనీ వేగంగా పని చేస్తోందని తెలుస్తుంది. వీటిలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది.

అయితే Samsung Galaxy S25 5Gకి సంబంధించి కంపెనీ ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అఫిషియల్‌గా అందించలేదు. లీక్‌ల ప్రకారం Samsung రాబోయే సిరీస్‌ను Exynos 2500 ప్రాసెసర్‌తో పరిచయం చేయవచ్చు. సిరీస్ టాప్ మోడల్ అంటే Galaxy S25 Ultraలో వినియోగదారులు Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌ని పొందవచ్చు. సామ్‌సంగ్ ఈ ఏడాది చివరి నాటికి Samsung Galaxy S25 5G సిరీస్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories