Samsung Galaxy M35 5G: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..

Samsung Galaxy M35 5G: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
x

Samsung Galaxy M35 5G: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ ఫోన్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..

Highlights

Samsung Galaxy M35 5G: సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

Samsung Galaxy M35 5G: సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఓవైపు ప్రీమియం ఫోన్‌లను లాంచ్‌ చేస్తూనే మరోవైపు బడ్జెట్‌ ఫోన్‌లను కూడా తీసుకొస్తోంది. మొన్నటి వరకు ప్రీమియం మార్కెట్‌ను టార్గట్‌ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొచ్చిన ఈ కంపెనీ తాజాగా మార్కెట్లోకి బడ్జెట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. గ్యాలక్సీ ఎమ్‌35 పేరుతో ఈ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. గ్యాలక్సీ ఎమ్‌35 ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. దీంతో ఈ ఫోన్‌ను సన్‌ లైట్‌లో కూడా క్లారిటీగా చూడొచ్చు. ఈ ఫోన్‌లో కార్నింగ్‌ గొరిల్లా విక్టస్‌+ ప్రొటెక్షన్‌ను అందించారు.

ఇక ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను, 2 ఎంపీతో మ్యాక్రో సెన్సర్‌ కెమెరాను అందింఆచరు. ఇక బ్యాటరీ విషయానికోస్తే ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ పరంగా చూస్తే ఇందులో వైఫై 6, బ్లూటూత్‌ 5.3, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

ఇక ఈ ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా, 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.21,499, 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.24,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను మూన్‌లైట్‌ బ్లూ, డే బ్రేక్‌ బ్లూ, థండర్‌ గ్రే కలర్స్‌లో తీసుకొచ్చారు. జులై 20 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ ఫోన్‌పై రూ. 1000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోది.

Show Full Article
Print Article
Next Story
More Stories