Samsung Galaxy A06: సామ్‌సంగ్ నుంచి బడ్జెట్ కిల్లర్.. రూ.9,999కే సూపర్ ఫీచర్స్..!

Samsung Galaxy A06
x

Samsung Galaxy A06

Highlights

Samsung Galaxy A06: సామ్‌సంగ్ Galaxy A06ని భారతదేశంలో విడుదల చేసింది. దీన్ని రూ.9,999తో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy A06: మొబైల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సామ్‌సంగ్ తన కొత్త బడ్జెట్ ఫోన్ Samsung Galaxy A06ని భారతదేశంలో విడుదల చేసింది. ఇంతకముందు ఎంపిక చేసిన ఆసియా మార్కెట్లలో దీన్ని లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ MediaTek Helio G85 చిప్‌సెట్, 6.7 అంగుళాల HD + డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఇది 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ Samsung Galaxy A06 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర మొదలైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samsung Galaxy A06 Price
సామ్‌సంగ్ గెలాక్సీ A06 స్మార్ట్‌ఫోన్ 4GB/64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499. ఈ ఫోన్ Samsung India వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్, లైట్ బ్లూ కలర్స్‌లో దక్కించుకోవచ్చు.

Samsung Galaxy A06 Specifications
సామ్‌సంగ్ Galaxy A06 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల HD + PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720 x 1,600 పిక్సెల్‌లు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో octa-core MediaTek Helio G85 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది గరిష్టంగా 4GB RAM+128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా One UI 6లో రన్ అవుతుంది. భద్రత కోసం ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఉంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే Samsung Galaxy A06 వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ యూనిట్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. Galaxy A06 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం డ్యూయల్ 4G, Wi-Fi, బ్లూటూత్ 5.3, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్ పొడవు 167.3 మిమీ, వెడల్పు 77.3 మిమీ, మందం 8.0 మిమీ, బరువు 189 గ్రాములు.

Show Full Article
Print Article
Next Story
More Stories