Jio Phone 5G Mobile: దేశంలోనే చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..?

Reliance Jio Launches Indias First Cheap 5G Smartphone Know how the Features are
x

Jio Phone 5G Mobile: దేశంలోనే చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతంటే..?

Highlights

Jio Phone 5G Mobile: రిలయన్స్ జియో దేశంలోనే మొట్టమొదటి 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతోంది.

Jio Phone 5G Mobile: రిలయన్స్ జియో దేశంలోనే మొట్టమొదటి 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతోంది. ఈ మొబైల్ కోసం మార్కెట్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్ ఫీచర్లు, ధరపై అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. రిలయన్స్‌ జియో 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.8000 నుంచి రూ.12000 మధ్య ఉండవచ్చని ఒక నివేదికలో పేర్కొంది. JioPhone 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్ట్ 2023లో లాంచ్ అవుతుందని అందరు భావిస్తున్నారు. ఇది ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ అని చెప్పొచ్చు.

రిలయన్స్‌ జియో 5G స్మార్ట్‌ఫోన్ JioPhone Next కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. తొలుత ఈ ఫోన్ ధర రూ.5000 మాత్రమే ఉంటుందని చెప్పారు. ఈ కొత్త ఫోన్ గురించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ పరిస్థితిలో JioPhone 5G స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన ధర తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అంచనా వేస్తున్న ఫీచర్లు ఇలా ఉన్నాయని తెలుస్తోంది.

జియోఫోన్ 5G స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే పరిమాణం 6.5-అంగుళాలు, ఫోన్ 1,600 x 720 పిక్సెల్ రిజల్యూషన్‌తో IPS LCD డిస్‌ప్లేను పొందవచ్చు. దీని రిఫ్రెష్ రేట్ 60Hz కావచ్చు. ఫోన్ మెరుగైన పనితీరు కోసం octa-core Qualcomm Snapdragon 480 5G ప్రాసెసర్ ఫోన్‌లో అందుబాటులో ఉంటుందని అంచనా. అలాగే ఈ ఫోన్ Adreno 619 GPUని పొందే అవకాశం ఉంది. ఫోన్ 4GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

డ్యూయల్ రియర్ కెమెరాను JioPhone 5Gలో చూడవచ్చు. ఇందులో ప్రైమరీ సెన్సార్ 13MP, 2MP మాక్రో సెన్సార్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని ఇవ్వొచ్చు. ఫోన్ బ్యాటరీ 5000mAh ఉంటుంది. ఇది ఛార్జింగ్ కోసం USB టైప్-C టైప్ పోర్ట్‌తో 18W ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. Jio Phone Next లాగానే JioPhone 5G కూడా ప్రగతి OS ఆపరేటింగ్ సిస్టమ్‌లో పని చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories