Komaki Cruiser: కోమాకి నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ విడుదల.. ధర ఎంతంటే..?

Release of the First Electric Cruiser Motorcycle From Comaki What is the Price
x

Komaki Cruiser: కోమాకి నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ విడుదల.. ధర ఎంతంటే..?

Highlights

Komaki Cruiser: ఢిల్లీకి చెందిన కొమాకి ఎలక్ట్రిక్ వెహికిల్స్ కంపెనీ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది.

Komaki Cruiser: ఢిల్లీకి చెందిన కొమాకి ఎలక్ట్రిక్ వెహికిల్స్ కంపెనీ 2016లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ఈ కంపెనీ దేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్ అయితే రెండోది వెస్పా మాదిరి ఎలక్ట్రిక్ స్కూటర్ కొమాకి వెనిస్. కోమాకి రేంజర్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్ ధర రూ.1.68 లక్షలు. కాగా కొమాకి వెనిస్ ఈ-స్కూటర్ ధర రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు.

ఎలక్ట్రిక్ క్రూయిజర్ స్పెసిఫికేషన్లు..

కోమాకి రేంజర్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ మోటార్ సైకిల్. ఇది డీప్ బ్లూ, గార్నెట్ రెడ్, జెట్ బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. రేంజర్ లో 4kW (5.36 hp) ఎలక్ట్రిక్ మోటార్ను పొందుపరిచారు. 4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 180-200 కిమీల క్లెయిమ్ రైడింగ్ రేంజ్ను అందిస్తుంది. స్మార్ట్ ఫీచర్ల పరంగా ఇది బ్లూటూత్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, సైడ్-స్టాండ్ సెన్సార్ మొదలైనవి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ క్రూయిజర్ పెద్ద అల్లాయ్ వీల్స్, రెండు స్టోరేజ్ బాక్స్లు, ఫాక్స్ ఎగ్జాస్ట్ను కలిగి ఉంది.

కోమాకి వెనిస్ రెట్రో స్టైలింగ్తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మొత్తం 10 కలర్ షేడ్స్లో అందుబాటులో ఉంటుంది. వెనిస్ 2.9kWh బ్యాటరీ ప్యాక్తో జతచేయబడిన 3kW (4 hp) ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. అయితే, కంపెనీ దీని రేంజ్ను ఇంకా ప్రకటించలేదు. ఫీచర్ల విషయానికొస్తే కొమాకి వెనిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్, యాంటీ-థెఫ్ట్ లాక్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ అసిస్ట్, పగటిపూట రన్నింగ్ LED తో LED హెడ్ల్యాంప్ వంటివి ఉంటాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు జనవరి 26, 2022 నుండి దేశవ్యాప్తంగా అన్ని కోమాకి షోరూంలలో అందుబాటులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories