Redmi Watch: ఇండియాలో రెడ్‌మీ వాచ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా...!
Redmi Watch: రెడ్‌మీ నోట్ 10ఎస్ ఫోన్ ఇండియాలో మే 13న రిలీజ్ కానుంది. దీంతోపాటు రెడ్ మీ వాచ్ కూడా విడుదల కానుంది.
Redmi Watch: రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మే 13న రిలీజ్ కానుంది. దీంతోపాటు రెడ్ మీ వాచ్ కూడా విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ చైనాలో 2020 నవంబర్‌లోనే రిలీజ్ అయింది.
దీనికి సంబంధించిన కొత్త టీజర్ కూడా రెడ్‌మీ ఇండియా పేజీలో #WearYourVibe హ్యాష్ ట్యాగ్ తో షేర్ చేసింది. ఈ ఫోన్ వాచ్, స్ట్రాప్ లుక్‌ను ఆ వీడియోలో చూపించారు. రెడ్‌మీ బ్రాండింగ్‌తో మనదేశంలో రిలీజ్ అయ్యే తొలి స్మార్ట్ వాచ్ ఇదే కానుంది.
ఈ ఫోన్ ధరను చైనాలో 299 యువాన్లుగా(సుమారు రూ.3,400) ఉంది. ఇండియాలో దీని ధరను ఇంకా వెల్లడించలేదు. ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ వైట్ రంగుల్లో ఈ వాచ్ లభించనుంది. చెర్రీ బ్లాసం, ఎలిగెంట్ బ్లాక్, ఇంక్ బ్లూ, ఇవోరీ వైట్ రంగుల్లో స్ట్రాప్ అందుబాటులో ఉన్నాయి.
ఈ వాచ్‌లో 1.4 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను తో రానుంది. అలాగే బ్లూటూత్ 5.0, దాదాపు 120 వాచ్ ఫేసెస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 5.0, ఆ పైబడిన, ఐవోఎస్ 10.0+ ఆ పైబడిన ఫోన్లకు ఈ వాచ్‌ను పెయిర్ చేసుకోవచ్చు. 230 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ వాచ్ పనిచేయనుంది. ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో ఫోన్ అందించారు. అలాగే కాల్ నోటిఫికేషన్, మెసేజ్ రిమైండర్, అలారం రిమైండర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Hope we amazed you with the #ultimate design of #Redmi's first ever!
— Redmi India - #RedmiNote10 Series (@RedmiIndia) May 6, 2021
It's time to change the direction to Level III! 😜
Here to make sure you find your way anytime, anywhere!
Did you catch our #vibe?!
RT to let us know what's cooking!
Get Notified: https://t.co/YHvH7ZBIgR pic.twitter.com/OsRuNBP2B7
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire