Redmi: రెడ్‌మి నుంచి సరికొత్త 5జి స్మార్ట్‌ఫోన్.. ధర, డిజైన్‌, ఫీచర్లు అద్భుతం..!

Redmi Is Launching 5G Smartphone After Seeing The Design It Seems Like A Definite Must Buy
x

Redmi: రెడ్‌మి నుంచి సరికొత్త 5జి స్మార్ట్‌ఫోన్.. ధర, డిజైన్‌, ఫీచర్లు అద్భుతం..!

Highlights

Redmi 13C: రెడ్‌ మి 13 సి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది మొదటిసారిగా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

Redmi 13C: రెడ్‌ మి 13 సి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది మొదటిసారిగా భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో రెండో ఫోన్‌ Redmi 13C 5G. ఇది అత్యంత సరసమైన 5G ఫోన్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. అమెజాన్ ఇండియా ల్యాండింగ్ పేజీ Redmi 13C 5G వేరియంట్ గురించి వెల్లడించింది. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. గ్రే, బ్లూ, ఆరెంజ్. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Redmi 13C 5G డిజైన్

ఈ ఫోన్‌లో 'స్టార్‌ట్రైల్' డిజైన్ ఉంటుందని చెబుతున్నారు. ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంటుంది. వెనుకవైపు LED ఫ్లాష్‌తో కూడిన 50MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని అందరు భావిస్తున్నారు. ఫోన్ డిజైన్ ముందు నుంచి కనిపించదు. ముందు భాగంలో పంచ్ హోల్ డిస్‌ప్లే లేదా వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్‌ MediaTek Dimensity 6100 Plus చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది శక్తివంతమైన ఫోన్‌గా మారుతుంది. Redmi 13C 5Gలో 8GB వరకు RAM, 8GB వరకు వర్చువల్ RAM, UFS 2.2 స్టోరేజ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో కూడిన డిస్‌ప్లే ఉంటుంది. Redmi 13C 5G భారతదేశంలో స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్ షైన్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. లాంచ్ సమయంలో ధర ప్రకటిస్తారు.

Redmi 13C (4G) స్పెసిఫికేషన్స్

Redmi 13C (4G) పెద్ద 6.74-అంగుళాల HD+ 90Hz LCD ప్యానెల్‌ని కలిగి ఉంటుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది మంచి క్వాలిటీ ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయగలదు. ఇది పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రోజు మొత్తం సౌకర్యవంతంగా ఉపయోగించవచ్చు. Redmi 13C (4G) గ్లోబల్ మార్కెట్‌లో గరిష్టంగా 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ఇది MIUI 14 ఆధారిత ఆండ్రాయిడ్ 13 పై రన్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories