Redmi 14C Launched: బాస్ ఈజ్ బ్యాక్.. రూ.11 వేలకే కొత్త ఫోన్.. రెడ్‌మీ దెబ్బ అదుర్స్..!

Redmi 14C Launched
x

Redmi 14C Launched

Highlights

Redmi 14C Launched: రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ Redmi 14Cని లాంచ్ చేసింది. దీన్ని రూ.11 వేలతో కొనుగోలు చేయవచ్చు.

Redmi 14C Launched: చైనీస్ టెక్ దిగ్గజం రెడ్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్ Redmi 14C ఫోన్ విడుదల చేసింది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, పెద్ద 5160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.88 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్‌లో MediaTek Helio G81 చిప్‌సెట్ ఉంటుంది. ఫోన్ పీక్ బ్రైట్నెస్ 600 నిట్‌లు. సెల్ఫీ కోసం ఫోన్ ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు తదితర వివరాలను తెలుసుకుందాం.

Redmi 14C Price
రెడ్‌మీ 14C ధర 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ వేరియంట్ కోసం PLN 2,999 అంటే దాదాపు రూ. 11,000 నుండి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర PLN 3,699 సుమారు రూ. 13,500. మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్, డ్రీమీ పర్పుల్, స్టార్రీ బ్లూ కలర్ వేరియంట్‌లలో కంపెనీ ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఫోన్ చెక్యాలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో కూడా లిస్ట్ అయింది.

Redmi 14C Specifications
రెడ్‌మీ 14C ఫోన్ IPS LCD ప్యానెల్ 6.88 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో MediaTek Helio G81 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8 GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లింకై ఉంటుంది. స్టోరేజీని పెంచుకోవడానికి ఫోన్‌లో మైక్రో SD కార్డ్‌కు సపోర్ట్ కూడా అందిచారు. Mali-G52 MC2 GPU గ్రాఫిక్స్ కోసం ఇందులో అందుబాటులో ఉంది.

కెమెరా గురించి చెప్పాలంటే ఇది వెనుక వైపున 50MP మెయిన్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. దీనితో పాటు LED ఫ్లాష్‌కు సపోర్ట్ ఇస్తుంది. సెల్ఫీ కోసం, ఫోన్ ముందు వైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. బ్యాకప్ కోసం ఫోన్ 5160mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. దీనితో కంపెనీ 18W ఛార్జింగ్ ఫీచర్‌ను అందించింది. ఇది కాకుండా ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, లో 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories