Red Magic 10 Pro: రెడె మ్యాజిక్ నుంచి ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్.. 1.5K రియల్ ఫుల్ స్క్రీన్‌తో వస్తుంది

Red Magic 10 Pro
x

Red Magic 10 Pro

Highlights

Red Magic 10 Pro: రెడ్ మ్యాజిక్ (Red Magic) చైనాలో తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రెడ్ మ్యాజిక్ 10 ప్రో (Red Magic 10 Pro) లాంచ్ తేదీని ఇటీవల ధృవీకరించింది.

Red Magic 10 Pro: రెడ్ మ్యాజిక్ (Red Magic) చైనాలో తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రెడ్ మ్యాజిక్ 10 ప్రో లాంచ్ (Red Magic 10 Pro) తేదీని ఇటీవల ధృవీకరించింది. ఈ సిరీస్‌లో రెడ్ మ్యాజిక్ 10 ప్రో, రెడ్ మ్యాజిక్ 10 ప్రో+, రెడ్ మ్యాజిక్ 10 అల్ట్రా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు బ్రాండ్ ఈ రాబోయే ఫోన్ డిస్‌ప్లే స్పెక్స్‌ను నిర్ధారిస్తూ కొత్త టీజర్‌ను షేర్ చేసింది. ఈ రాబోయే హ్యాండ్‌సెట్‌కి సంబంధించిన లీకైన వివరాల గురించి తెలుసుకుందాం.

ఈ టీజర్‌లో రెడ్ మ్యాజిక్ 10 ప్రో లైనప్ చూడచ్చు. ఇది దాని కొత్త వుకాంగ్ స్క్రీన్‌ను చూపుతుంది. ఇది టెక్ మార్కెట్ మొదటి 1.5K రియల్ ఫుల్ స్క్రీన్ అని రెడ్ మ్యాజిక్ పేర్కొంది. అంటే ఫోన్ డిస్‌ప్లే ముందు భాగంలో నాచ్ లేదా పంచ్ హోల్ కటౌట్ లేదు. ప్యానెల్ చుట్టూ బెజెల్‌లు కూడా ఉన్నాయి. ఫోటో పోస్టర్ అల్ట్రా-హై స్క్రీన్-టు-బాడీ రేషియో 95.3 శాతంతో ఉంటుంది.

రాబోయే హ్యాండ్‌సెట్ ప్రసిద్ధ డిస్‌ప్లే మేకర్ BOE తయారి చేసిన OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ వుకాంగ్ స్క్రీన్ రెడ్ మ్యాజిక్ 10 ప్రో సిరీస్‌తో ప్రారంభమవుతుంది, నుబియా Z70 అల్ట్రా కూడా ఈ డిస్‌ప్లే టెక్నాలజీని తర్వాత అందుకుంటుంది. ఇటీవలే రెడ్ మ్యాజిక్ 10 ప్రో గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో దాని పర్ఫామెన్స్ చూపించింది. అలాగే, Red Magic 10 Pro+ 2688 x 1216 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాతో 7-అంగుళాల+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

రెడ్ మ్యాజిక్ 10 ప్రో సిరీస్‌లో గేమింగ్ చిప్ పీసీ లెవల్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫోన్‌ను పవర్ చేయడానికి, పెద్ద 7,050mAh బ్యాటరీ ప్యాక్ 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని భావిస్తున్నారు. రెడ్ మ్యాజిక్ 10 ప్రో మోడల్స్ కూడా కొన్ని రోజుల క్రితం 3C సర్టిఫికేషన్‌పై వచ్చాయి. అక్టోబర్‌లో రెడ్ మ్యాజిక్ 10 అల్ట్రా లీకైన ఫోటోలో కనిపించింది. దాని ముందున్న దానితో పోలిస్తే కొత్త డిజైన్‌లో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories