Realme 13 5G: రియల్‌మీ జాతర.. రెండు కొత్త ఫోన్లు.. రేపే సేల్..!

Realme 13 5G
x

Realme 13 5G

Highlights

Realme 13 5G: రియల్‌మీ ఆగస్ట్ 29న Realme 13 5G, Realme 13+ 5G స్మార్ట్‌ఫోన్లను సేల్‌కు తీసుకురానుంది. రూ.15 వేలతో కొనుగోలు చేయవచ్చు.

Realme 13 5G: భారతీయ టెక్ మార్కెట్‌లో కొత్తకొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌ టార్కెట్ చేసుకొని కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ ఆగస్ట్ 29న Realme 13 5G, Realme 13+ 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. బ్రాండ్ ఇప్పటికే Realme 13 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ కొన్ని ఫీచర్లను విడుదల చేసింది. ఫోన్ లాంచ్ చేయడానికి ముందు దాని కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించింది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రాబోయే Realme స్మార్ట్‌ఫోన్‌లు దేశంలో రియల్‌మీ ఇండియా ఈ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ ధరలను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 15,000 ఉంటుంది. వెనిలా, ప్లస్ వేరియంట్‌ల ధర రూ. 20,000 ఉంటుందని లీక్ చూపిస్తుంది.

Realme స్మార్ట్‌ఫోన్ స్పీడ్‌వేవ్ డిజైన్‌తో వస్తుంది. దీనితో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP65 సపోర్ట్‌తో వస్తుంది. స్పీడ్ గ్రీన్, విక్టరీ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. Realme 13 5G, Realme 13+ 5G లు 120Hz రిఫ్రెష్ రేట్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, AI ఐ కంఫర్ట్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ SoC లభిస్తుందని Realme వెల్లడించింది. చిప్‌సెట్ గరిష్టంగా 26GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. GT మోడ్‌తో Realme 13+ 5Gలో గేమింగ్ ఫీచర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. Realme 13+ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా Realme UI 5పై రన్ అవుతుంది.

Realme 13 5G, Realme 13+ 5G బ్యాక్ సైడ్ ఓవల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది LED ఫ్లాష్‌ను కూడా కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ OISతో 50MP Sony LYT 600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని Realme ధృవీకరించింది. కంపెనీ ప్లస్ వేరియంట్ కోసం 8MP అల్ట్రావైడ్ కెమెరాను, రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 16MP సెల్ఫీ కెమెరాను ప్యాక్ చేయాలని భావిస్తుంది. ఇది 80W వైర్డ్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories