Realme New Mobile: రియల్‌మి దీపావళి ఆఫర్.. కొత్త ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్..!

Realme NARZO 70 Turbo 5G
x

Realme NARZO 70 Turbo 5G

Highlights

Realme New Mobile: రియల్‌మి Narzo 70 Turbo 5G స్మార్ట్‌‌ఫోన్ లాంచ్ చేయనుంది. మొదటి సేల్‌లో భాగంగా 2 వేల రూపాయలు కూపన్ డిస్కౌంట్ అందిస్తుంది.

Realme New Mobile: కొత్త ఫోన్ కొనాలనుకొనే వారికి రియల్‌మి అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంపెనీ నార్జో లైనప్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఈరోజు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. Realme Narzo 70 Turbo 5G పేరుతో దీన్ని మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. దీని ధర చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్ 7,50,000తో వస్తుంది. ఫోన్ 4nm డైమెన్సిటీ 7300E చిప్‌సెట్‌ని కలిగి ఉన్నట్లు నిర్ధారించింది. అలానే మొదటి సేల్ సందర్భంగా నార్జో 70 టర్బో 5Gపై ప్రత్యేక కూపన్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్లు రియల్‌మి తెలిపింది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రియల్‌మి Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2000 కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. దీపావళికి ముందే దీపావళి ఆఫర్‌లను ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో మెరుగైన గేమింగ్ ఫీచర్లు ఉంటాయి. అనేక గేమ్‌లలో 90 FPS పనితీరును ఇస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను realme.com, Amazon.inలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM +256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అమెజాన్, రియల్‌మి ఆఫిషియల్ సైట్‌లో పోస్ట్ చేయబడిన మైక్రోసైట్‌లలో పోస్ట్ చేసిన టీజర్ మోటార్‌స్పోర్ట్ డిజైన్‌తో హ్యాండ్‌సెట్‌ను చూపుతుంది.

Realme Narzo 70 Turbo Specifications
నివేదికల ప్రకారం Realme Narzo 70 Turbo 6.67-అంగుళాల FHD+ Samsung E4 OLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 1080 X 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 92.65 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, AG DT స్టార్ కోసం 2 గ్లాస్. 600nits స్టాండర్డ్ బ్రైట్నెస్, 1200nits పీక్ బ్రైట్నెస్‌కు సపొర్ట్ ఇస్తుంది.

ఫోన్‌ MediaTek డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్‌సెట్, గ్రాఫిక్స్ కోసం Mali G615 GPUని కలిగి ఉంటుంది. SoC 6GB/128GB, 8GB/128GB, 12GB/256GB UFS 3.1 స్టోరేజ్‌ ఉంటుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14-ఆధారిత Realme UI కస్టమ్ స్కిన్‌లో రన్ అవుతుంది. కంపెనీ 2 OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌ల అప్‌డేట్స్ ఇస్తుంది.

45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో 6050mm2 స్టెయిన్‌లెస్ స్టీల్ VC కూలింగ్, IP65 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 6-యాక్సిస్ హైపర్‌సెన్సిటివ్ గైరోస్కోప్, TUV SUD లాగ్-ఫ్రీ మొబైల్ గేమింగ్ సర్టిఫికేట్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories