Realme 13 Plus 5G: వేరే లెవల్ వర్మ.. రియల్‌మీ గేమింగ్ ఫోన్.. మామా తగ్గేదే లేదు..!

Realme 13 Plus 5G
x

Realme 13 Plus 5G

Highlights

Realme 13 Plus 5G: గేమింగ్ కోసం 90fps సపోర్ట్‌తో రియల్‌మీ 13 ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఆగస్టు 29న విడుదల కానుంది.

Realme 13 Plus 5G: ప్రసుత 5జీ యుగంలో ఆన్‌లైన్ గేమ్స్‌కు డిమాండ్ భారీగా పెరుగుతుంది. యువత ఎక్కువగా ల్యాప్ టాప్స్, కంప్యూటర్లలో గేమ్స్ ఆడుతుంటారు. క్రమంగా స్మార్ట్‌ఫోన్‌లలో కూడా గేమ్స్ ఆడే వారి సంఖ్య ఎక్కువైంది. గేమ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసేందుకు ఎక్కువ ర్యామ్ అవసరం అవుతుంది. అలానే గ్రాఫిక్స్, బ్యాటరీల లైఫ్ కూడా ఎక్కువగా ఉండాలి. ఈ క్రమంలోనే గేమింగ్ కోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ Realme 13 Plus 5Gని లాంచ్ చేయనుంది. దీని లాంచ్ డేట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Realme 13+ 5G Launch Date
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 29న భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. బడ్జెట్ ప్రైస్‌లో అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం ఈ ఫోన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు చూస్తే ఇది కచ్చితమైన గేమింగ్ ఫోన్‌గా తెలుస్తెంది. కాబట్టి ఈ ఫోన్‌లో కొత్తగా ఎటువంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం.

Realme 13 Plus 5G Specifications
రియల్‌మీ 13 ప్లస్ 5జీ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌పై వస్తుంది. ఇది 4 × 2.5GHz A78 కోర్స్‌తో వస్తుంది. ఈ ఫోన్ AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్ 750,000 కంటే ఎక్కువ. ఇది శక్తివంతమైన ఫోన్. దీని 4nm ప్రాసెస్ చిప్ ముందు మోడల్ కంటే 30 శాతం ఎక్కువ శక్తివంతమైనది. గేమింగ్ చేసేటప్పుడు మీకు మెరుగైన పనితీరును అందిస్తుంది.

Realme 13 Plus 5G స్మార్ట్‌ఫోన్ 26GB వరకు డైనమిక్ RAM (12GB ఫిజికల్ + 14GB వర్చువల్) 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన యాప్ లాంచింగ్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది 32 యాప్‌లను ఏకకాలంలో యాక్టివ్‌గా ఉంచగలదు. గేమింగ్ సమయంలో మల్టీటాస్కింగ్, యాప్ స్విచ్చింగ్‌ను సులభతరం చేయడానికి ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉంటాయి.

గేమింగ్ ప్రియుల కోసం Realme 13+ 5Gలో GT మోడ్ ఉంటుంది. ఇది ఫోన్ పనితీరును వేరే లెవల్‌కి తీసుకువెళుతుంది. ఈ మోడ్ గేమింగ్ సమయంలో గేమ్ ప్లేని 90fpsలో యాక్టివ్‌గా ఉంచుతుంది. గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. MLBB, ఫ్రీ ఫైర్ వంటి ఫేమస్ గేమ్‌ల కోసం Realme 13+ 5G 7 గంటల వరకు 90fps ఫుల్ ఫ్రేమ్ రేట్‌ను నిర్వహించడానికి ఈ ఫీచర్ సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories