Best Mobile Offers: ఆఫర్లు అదిరాయ్.. తక్కువ ధరకే ప్రీమియం ఫోన్లు.. చెక్ చేయండి..!

Best Mobile Offers
x

Best Mobile Offers

Highlights

Best Mobile Offers: అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ, వన్‌ప్లస్, ఐక్యూ మొబైల్స్‌ను రూ.20 వేలలో కొనుగోలు చేయవచ్చు.

Best Mobile Offers: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల నుంచి టీవీ, ఫ్రిజ్, ఇతర ఉత్పత్తులపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తుంది. కొన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై స్పెషల్ తగ్గింపులు ఉన్నాయి. నో కాస్ట్ ఈఎమ్ఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా రూ.20 వేల బడ్జెట్ లోపు బెస్ట్ ఫోన్లను అందిస్తుంది. ఈ క్రమంలో వీటి ఆఫర్లు, ధరలు , ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Realme NARZO 70 Pro 5G
రియల్‌మీ ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ 11 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. దీని టాప్ వేరియంట్ 18,998 రూపాయలకు సేల్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్ సేల్‌లో రూ. 2750 కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంది.

OnePlus Nord CE4 Lite 5G
వన్‌ప్లస్ ఈ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 5500mAH బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌‌తో వస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz.ఆండ్రాయిడ్ 14పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ ధర రూ.19,999. దీనిపై రూ.1000 కూపన్ తగ్గింపు లభిస్తుంది.

iQOO Z9 5G
ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7200 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఓఎస్‌తో ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ.19,998. సేల్‌లో SBI కార్డ్‌లపై రూ. 2,250 తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్లన్నింటిపైనా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటినీ నో కాస్ట్ EMIతో కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories