Realme C63 5G Launch: ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది.. రూ.9,999కే రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్..!

Realme C63 5G
x

Realme C63 5G

Highlights

Realme C63 5G Launch: రియల్ Realme C63 5Gని విడుదల చేసింది. ఆఫర్‌లో బేస్‌ వేయంట్‌‌ను రూ.9,999కి కొనుగోలు చేయవచ్చు.

Realme C63 5G Launch: టెక్ మార్కెట్ వేగంగా పరుగెడుతుంది. రోజుకో సరికొత్త ఫోన్ దేశంలోకి వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ Realme C63 5Gని విడుదల చేసింది. ఇది రూ.10,000 కంటే తక్కువ ధరకే లభించే 5G ఫోన్ అవుతుంది. మొబైల్ ప్రియులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ C సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ సైడ్ డిజైన్‌ కలిగి ఉంటుంది. ఫోన్ టాప్‌లో సెంటర్ స్క్వేర్ కెమెరా మాడ్యూల్ సెటప్‌ ఉంటుంది. మీరు బడ్జెట్‌లో 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ ఫోన్‌ని ట్రై చేయండి. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

Realme C63 5G Specifications
రియల్‌మీ Realme C63 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 120Hz రిఫ్రెష్ , 625 నిట్స్ హై బ్రైట్‌నెస్ మోడ్‌తో 6.67-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని బరువు 190 గ్రాములు. థిక్నెస్ 7.94 మిమీ. హ్యాండ్‌సెట్‌లో Mali G57 MC2 GPUతో ఆక్టా-కోర్ 6nm MediaTek డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ ఉంటుంది. C63 5G Android 14 ఆధారంగా Realme UI 5.0 పై రన్ అవుతుంది.

ఈ రియల్‌మీ 5G ఫోన్‌లో పవర్ కోసం 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కెమెరా గురించి చెప్పాలంటే ఇది 32MP ప్రైమరీ బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ కోస C63 5Gలో Wi-Fi 5, బ్లూటూత్ 5.3, హెడ్‌ఫోన్ జాక్, మైక్రో SD కార్డ్ స్లాట్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంది.

హ్యాండ్‌సెట్ మూడు ర్యామ్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో 4GB + 128GB,6GB + 128GB, 8GB + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ ,10999, 11999, 12999. ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, స్టార్రీ గోల్డ్ అనే రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 1,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 20న మధ్యాహ్నం 12:00 గంటలకు Flipkart, Realme.comలో ప్రారంభమవుతుంది. ఆఫర్‌తో ఫోన్ బేస్‌ వేయంట్‌ ధర రూ.9,999 అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories