Realme GT 7 Pro: అప్పుడే వచ్చేసింది.. 6,000mAh+ బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయ్..!

Realme GT 7 Pro
x

Realme GT 7 Pro

Highlights

Realme GT 7 Pro: 6,000mAh+ బ్యాటరీ, BOE X2 డిస్‌ప్లేతో రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు లీక్ అయ్యాయి.

Realme GT 7 Pro: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఇటీవలే చైనాలో Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ లేదా నవంబర్ చివరి నాటికి మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాబోయే వారాల్లో మార్కెట్లో రియల్‌మీ 13ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. రియల్‌మీ జీటీ 7 ప్రో తదుపరి తరం స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఇప్పటికే GT 7 ప్రో గురించి అనేక వివరాలను వెల్లడించింది. ఈ రోజు టిప్‌స్టర్ తన Weibo హ్యాండిల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలను విడుదల చేశారు.

Realme GT 7 Pro Specifications (రియల్‌మీ జీటీ 7 ప్రో స్పెసిఫికేషన్స్)
Weibo పోస్ట్‌ వివరాల ప్రకారం Realme GT 7 Pro సరికొత్త BOE X2 డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మైక్రో-కర్వ్డ్ అంచులు ఉన్నప్పటికీ ఫ్లాట్‌గా కనిపిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో లాంచ్ అయిన Realme GT 5 Proలో BOE X1 డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లే పారామీటర్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే టెక్నాలజీ కోసం కంపెనీ వేరే బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చకుంది. డిస్ప్లే 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది లేటెస్ట్ BOE X2, BOE టెక్నాలజీతో వస్తుంది.

ఫోన్‌లో Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ టాప్ వెర్షన్‌లో 16GB RAM + 1TB స్టోరేజ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది 6,000mAh+ బ్యాటరీతో 100W ఛార్జింగ్ సపోర్ట్‌‌కు సపోర్ట్ చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే దానిపై స్పష్టత లేదు. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ఇంజనీరింగ్ ప్రోటోటైప్‌లో ఉంది.

Realme GT 7 Pro కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో LYT-600 3X పెరిస్కోప్ లెన్స్ ఉండవచ్చు. కానీ దీనికి టెలిఫోటో మాక్రో లెన్స్ లేకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 10x హైబ్రిడ్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. ఇది IP68/69 రేటింగ్‌ను పొందుతుంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షిస్తుంది.ఇది సింగిల్ పాయింట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories