Realme Republic Day Sale 2025: రియల్‌మి స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్‌పై భారీగా డిస్కౌంట్స్

Realme Republic Day Sale 2025: రియల్‌మి స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్‌పై భారీగా డిస్కౌంట్స్
x
Highlights

Realme Republic Day Sale 2025: Realme భారత్‌లో రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఇది జనవరి 13 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో, వివిధ Realme...

Realme Republic Day Sale 2025: Realme భారత్‌లో రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఇది జనవరి 13 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో, వివిధ Realme స్మార్ట్‌ఫోన్‌లు, AIOT ఉత్పత్తులపై లిమిటెడ్ టైమ్ ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా డీల్స్ అందుబాటులో ఉంటాయి. రియల్‌మి P2 Pro 5జీపై సేల్‌లో రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ, రియల్‌మి జిటి7 ప్రో సేల్ సమయంలో భారీ తగ్గింపులతో లభిస్తాయి. రియల్‌మి బడ్స్ T310, బడ్స్ T110 కూడా Realme రిపబ్లిక్ డే సేల్‌లో రూ. 500 వరకు తగ్గింపును అందిస్తున్నారు.

రాబోయే Realme రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా, Realme P2 Pro 5G ప్రారంభ ధర రూ. 17,999కి అందుబాటులో ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ సాధారణ ప్రారంభ ధరపై రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. అదేవిధంగా, Realme GT 7 Pro ప్రారంభ ధర రూ. 59,999కి బదులుగా రూ. 54,999 గా ఉంటుంది. రూ. 65,999 విలువైన 16GB RAM + 512 GB స్టోరేజ్ ఉన్న ఫోన్ టాప్-ఎండ్ వేరియంట్ రూ.59,999 కే అందుబాటులో ఉంటుంది.

కస్టమర్లు ఈ రాబోయే సేల్‌లో Realme 14x ను రూ. 1,000 తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఇది రూ. 13,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే, Realme 13 Pro వినియోగదారులకు రూ.26,999కి బదులుగా రూ.23,999 కే అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి నార్జో 70 టర్బో 5G బేస్ 6GB + 128GB వేరియంట్ రూ. 16,999కి బదులుగా రూ. 14,499 ధరతో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రియల్‌మి GT 6T ప్రారంభ ధర రూ. 30,999 నుండి రూ. 23,999 కి తగ్గించారు. ఫోన్ టాప్-ఎండ్ వేరియంట్ రూ. 39,999 నుండి రూ.29,999కి అందుబాటులో ఉంటుంది. రియల్‌మి 13+ 5G ప్రారంభ ధర రూ. 20,999కి బదులుగా రూ. 16,999గా నిర్ణయించారు.

సేల్‌లో వినియోగదారులకు Realme Buds Air 6 పై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. దీని కారణంగా దీని ధర రూ. 3,299కి బదులుగా రూ. 2,799 అవుతుంది. అదేవిధంగా, కస్టమర్లు 2,199 రూపాయలకు బదులుగా 1,999 రూపాయలకు Realme Buds T310ని కొనుగోలు చేయొచ్చు. Realme Buds T110 ధర రూ. 1,499కి బదులుగా రూ. 1,099 అవుతుంది.

రియల్‌మి రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 న లైవ్ అవుతుంది. అధికారిక Realme వెబ్‌సైట్, Amazon, Flipkartలో జనవరి 19 వరకు కొనసాగుతుంది. కొనుగోలుదారులు రిటైల్ స్టోర్ల ద్వారా Realme GT 7 Proపై డిస్కౌంట్స్ అందుకోవచ్చు. Realme 14x, Realme 13 Pro 5Gపై డిస్కౌంట్లు స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories