Mini AC: ఫుల్ ఛార్జ్ చేస్తే 12 గంటలపాటు సిమ్లా కన్నా చల్లని గాలి.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే గడ్డకట్టాల్సిందే.. ధర తెలిస్తే ఆర్డర్ పెట్టేస్తారు..!

Power Bank with Mini Ac Under rs 2000 Buy from Online Websites Check Features
x

Mini AC: ఫుల్ ఛార్జ్ చేస్తే 12 గంటలపాటు సిమ్లా కన్నా చల్లని గాలి.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే గడ్డకట్టాల్సిందే.. ధర తెలిస్తే ఆర్డర్ పెట్టేస్తారు..!

Highlights

Power Bank with Mini Air Conditioner: ఈ క్రమంలోనే వచ్చిందే పవర్ బ్యాంక్ మినీ ఏసీ. ఈ పరికరం అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే దీంతో మల్టీ టాస్కింగ్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ పవర్ బ్యాంక్ మినీ ఏసీతో ఇటు గదిని కూల్‌గా చేయడమే కాదు.. టార్చ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

Power Bank with Mini Air Conditioner: ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే దడ పుట్టేలా దంచి కొడుతున్నాయి. దీంతో ఇంట్లోనూ ఉండలేనంత వేడితో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది ఏసీలు, కూలర్లను కొంటున్నారు. లేదా పాత వాటినే రిపేర్లు చేయించి, వాడడం మొదలుపెడుతున్నారు. అయితే, వీటిని వాడాలంటే అటు కరెంట్ బిల్లు, ఇటు ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లోకి వ్ఇన పోర్టబుల్ ఏసీలు లేదా మినీ ఏసీలు జనాలకు ఎంతో ఉపశమనాన్ని అందిస్తున్నాయి. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉండడంతో ఎక్కువగా కొంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

ఈ క్రమంలోనే వచ్చిందే పవర్ బ్యాంక్ మినీ ఏసీ. ఈ పరికరం అనేక ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే దీంతో మల్టీ టాస్కింగ్ ఫీచర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఈ పవర్ బ్యాంక్ మినీ ఏసీతో ఇటు గదిని కూల్‌గా చేయడమే కాదు.. టార్చ్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.

అయితే, ఇక్కడ మనం ఎయిర్ కండీషనర్‌తో వచ్చే పవర్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాం. మినీ ఎయిర్ కండీషనర్ పవర్ బ్యాంక్‌కు జోడించారు. దీనితో, మీరు పవర్ బ్యాంక్ వాడకంతో పాటు చల్లని గాలిని ఆస్వాదించవచ్చు.

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మినీ ఎయిర్ కండీషనర్‌తో కూడిన ఈ పవర్ బ్యాంక్ పోర్టబుల్‌ను సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మినీ ఎయిర్ కండీషనర్‌తో పవర్ బ్యాంక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..

మినీ ఎయిర్ కండీషనర్‌తో కూడిన పవర్ బ్యాంక్ ప్లాస్టిక్ డిజైన్‌తో వస్తుంది. ఇది తెలుపు, నలుపు రంగు ఎంపికలలో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్నిర్మిత 6000mAh Li-బ్యాటరీని కలిగి ఉంది. దీని ఛార్జింగ్ సమయానికి వస్తే.. దాదాపు 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

ఈ డివైస్‌ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 7 నుంచి 12 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి DC 5V / 2A ఇన్‌పుట్ అవసరం. ఈ పరికరం ఫీచర్ల గురించి మాట్లాడితే, USB ఛార్జింగ్ ఇందులో అందించారు.

ధర, లభ్యత..

ఇది పర్యావరణ అనుకూలమైనదని కంపెనీ తెలిపింది. ఇది ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు. గాలి కోసం ఇందులో మూడు ఆఫ్షన్స్ ఇచ్చారు. దీని ధర కూడా చాలా తక్కువే. ఇది ఇ-కామర్స్ సైట్‌ల నుంచి 2000 రూపాయల కంటే తక్కువ ధరకు సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories