Poco M6 Plus: పోకో నుంచి మరో స్టన్నింగ్‌ ఫోన వచ్చేస్తోంది.. బడ్జెట్‌ ధరలోనే..

Poco M6 Plus: పోకో నుంచి మరో స్టన్నింగ్‌ ఫోన వచ్చేస్తోంది.. బడ్జెట్‌ ధరలోనే..
x

Poco M6 Plus: పోకో నుంచి మరో స్టన్నింగ్‌ ఫోన వచ్చేస్తోంది.. బడ్జెట్‌ ధరలోనే..

Highlights

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ పోకో ఎమ్‌ సిరీస్‌లో భాగంగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. పోకో ఎమ్‌6 ప్లస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజాలు భారత మార్కెట్లోకి మేడ్‌ ఇన్‌ ఇండియా ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ సబ్‌ బ్రాండ్‌ అయిన పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎమ్‌6 ప్లస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ భారత మార్కెట్లోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ పోకో ఎమ్‌ సిరీస్‌లో భాగంగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. పోకో ఎమ్‌6 ప్లస్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట మాత్రం కొన్ని ఫీచర్స్‌ లీక్‌ అయ్యాయి. వీటి ప్రకారం ఈ స్మార్ట్‌ వాచ్‌లో 6.79 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ ఓఎస్‌తో పనిచేయనుంది.

పోకో ఎమ్‌6 ప్లస్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 4 జెన్‌2 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఇక ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5030 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇవ్వనున్నార తెలుస్తోంది. ఈ కెమెరా 3x ఇన్ సెన్సార్ జూమ్‌తో రానుందని సమాచారం. అలాగే ఇదులో ఆటో నైట్ మోడ్‌ సపోర్ట్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక స్క్రీన్‌ సెంటర్‌ పంచ్‌ హోల్‌ డిజైన్‌తో రానుంది.

ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో IR బ్లాస్టర్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. కెమెరా సెటప్‌తో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌ కూడా రానుందని తెలుస్తోంది. ఇక ధర విషయానికొస్తే పోకో ఎమ్‌6 ప్లస్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 16 వేలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories