Poco F7 Series: పోకో నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. త్వరలోనే లాంచ్

Poco F7 Series: పోకో నుంచి కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. త్వరలోనే లాంచ్
x
Highlights

Poco F7 Series: బ్రాండ్ ఈ ఫోన్లను Poco F7 సిరీస్‌లో రీబ్రాండెడ్ మోడల్‌లుగా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయాలని భావిస్తుంది.

Poco F7 Series: స్మార్ట్‌ఫోన్ మేకర్ రెడ్‌మి తన K80, K80 Pro స్మార్ట్‌ఫోన్‌లను ఈ నెలలో చైనాలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బ్రాండ్ ఈ ఫోన్లను Poco F7 సిరీస్‌లో రీబ్రాండెడ్ మోడల్‌లుగా గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయాలని భావిస్తుంది. Redmi K80 బేస్ వేరియంట్ Poco F7 గా బ్రాండ్ చేయచ్చు. K80 Proకి Poco F7 అల్ట్రాగా తీసుకురావచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంతలో ఇటీవల Poco F7 సింగపూర్ IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఫోన్ మోడల్ నంబర్ 24117RK2CGతో లిస్ట్ అయింది. ఈ మోడల్ నంబర్‌లో “G” అంటే Poco ఈ స్మార్ట్‌ఫోన్‌లను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేస్తుంది.

లిస్టింగ్‌లో స్పెసిఫికేషన్‌లు తెలియనప్పటికీ 5G కనెక్టివిటీ సపోర్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఇది బ్లూటూత్, Wi-Fi, NFC వంటి స్టాండర్డ్ ఫీచర్లకు సపోర్ట్ ఇస్తుంది. ఇంతకుముందు Poco F7 ప్రో, Poco F7 అల్ట్రా మోడల్‌లు రెండూ IMEI డేటాబేస్‌లో కనిపించాయి.

Poco F7 Pro Features

Redmi K80లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ఉంటుందని భావిస్తున్నారు. రెండు బ్రాండ్‌ల మధ్య చారిత్రక సంబంధాన్ని బట్టి Poco F7 Pro కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ముందు భాగంలో 2K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED ప్యానెల్‌ వచ్చే అవకాశం ఉంది. ఇది 6000mAh శక్తివంతమైన బ్యాటరీని కూడా కలిగి ఉండవచ్చు. ఇటీవల Redmi K80 చైనా 3C సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. ఇది 120W ఛార్జింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది Poco F7 ప్రోతో సమానంగా ఉంటుంది.

రెడ్‌మి K80 రియల్ ఫీచర్లు ఒక నివేదికలో కనిపించాయి. ఇది సర్కిల్ కెమెరా ఐస్‌లాండ్‌తో కొత్త డిజైన్‌ను చూపుతుంది. Poco F7 Pro అదే డిజైన్‌ను కూడా అదే విధంగా ఉండొచ్చని అంటున్నారు నిపుణులు.

Poco F7 ప్రో అధికారిక లాంచ్ తేదీ ధృవీకరించబడనప్పటికీ, IMDA సర్టిఫికేషన్ త్వరలో ప్రారంభించవచ్చని సూచించింది. Redmi K80 సిరీస్ ఈ నెలాఖరులో చైనాలో ప్రారంభించే అవకాశాల కనిపిస్తున్నాయి. Poco F7 ప్రో, Poco F7 అల్ట్రా గ్లోబల్ మార్కెట్‌లో త్వరలో లాంచ్ కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories