Flipkart Mobile Offer: పోకో డెడ్‌పూల్ సేల్ షూరూ.. రూ.4 వేల డిస్కౌంట్.. లిమిటెడ్ డీల్!

Poco F6 Deadpool Edition
x

Poco F6 Deadpool Edition

Highlights

Flipkart Mobile Offer: పోకో ఎఫ్ 6 డెడ్‌పూల్ ఎడిషన్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు వచ్చింది. రూ.4 వేల డిస్కౌంట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

Flipkart Mobile Offer: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఫోకో మే 2024లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌తో Poco F6ని విడుదల చేసింది. అలానే దీనితో పాటు జూలై చివరలో బ్రాండ్ Poco F6 Deadpool Edition అనే ఫోన్ ప్రత్యేకమైన వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోకో స్పెషల్ ఎడిషన్ ధర, స్పెసిఫికేషన్‌లు తదితర వివరాలను తెలుసుకుందాం.

Poco F6 Deadpool Edition Price (పోకో ఎఫ్ 6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ ధర)
Poco F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ 12 GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది డెడ్‌పూల్-థీమ్ ఛార్జర్, SIM ఎజెక్టర్‌తో కూడిన ప్రత్యేకమైన బాక్సులో ఉంటుంది. కస్టమ్ థీమ్‌లు, వాల్‌పేపర్‌లు లేనప్పటికీ ఫోన్ డెడ్‌పూల్ లోగోతో అట్రాక్టెడ్ రెడ్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 33,999. అయితే దీనిపై రూ.4 వేలు డిస్కౌంట్ ఉంది. దీంతో రూ. 29,999కి ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి కొనుగోలు చేయడానికి కేవలం 3,000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Poco F6 Deadpool Edition Specifications (పోకో ఎఫ్ 6 డెడ్‌పూల్ స్పెసిఫికేషన్స్)
పోకో ఎఫ్ 6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే.. ఇది స్టాండర్డ్ వెర్షన్‌కు సమానంగా ఉంటుంది. 6.7-అంగుళాల OLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ బై ఇన్‌స్టాల్ వస్తుంది. ఫోన్ IP64 రేటింగ్‌తో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ కలిగి ఉంటుంది.

Poco F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్, LPDDR4x RAM, UFS 4.0 స్టోరేజ్, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంది. ఫోన్ Android 14తో HyperOSలో రన్ అవుతుంది. సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వెనుక ప్యానెల్‌లోOISతో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. దీని ఇతర ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories