Lebanon Pager Blasts: పేజర్ అంటే ఏంటి? దీన్ని పేలుళ్ళకు ఎలా వాడారు?

Pager Blast
x

Pager Blast

Highlights

Pager Blast: లెబనాన్‌లో జరిగిన వరుస పేలుళ్లలో పేజర్లను ఉపయోగించారు. ఇవి ఎలా పనిచేస్తాయి. తదితర వివరాలు తెలుసుకోండి.

Pager Blast: పేజర్.. ఈ డివైజ్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పుష్ప' పార్ట్ -1లో అందరూ చూసే ఉంటారు. అల్లు అర్జున్ ఈ డివైజ్ ద్వారానే ముఖ్యమైన మెసేజెస్ రిసీవ్ చేసుకుంటుంటాడు. చెప్పాలంటే అల్లు అర్జున్ ఓ డేంజర్ సిచ్యువేషన్‌లో ఉనప్పుడు, కేశవకు కాల్ చేసి ఓ నంబర్‌కు డేంజర్ అనే మెసేజ్ పంపాలని చెప్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు.

లెబనాన్‌లో సెప్టెంబర్ 17న జరిగిన పేజర్ బ్లాస్ట్స్‌లో తొమ్మిది మంది చనిపోయారు. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. దాంతో, పేజర్ డివైజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అయితే, ఈ విధ్వంసానికి పేజర్‌ను ఉపయోగించడంతో... వ్యక్తిగత భద్రతకు, గోప్యతకు సంబంధించిన అనేక ప్రశ్నలు తెర ముందుకు వచ్చాయి. ఇంతకీ, ఈ పేలుళ్ళకు పేజర్ ఎలా ఉపయోగించారు? ఈ డివైజ్ ఎలా డేంజరస్.. అనే విషయాలు తెలుసుకుందాం.

పేజర్ అంటే ఏమిటి?
పేజర్ అనేది పాత కమ్యూనికేషన్ గ్యాడ్జెట్. దీనిని బీపర్ లేదా బ్లీపర్ అని కూడా పిలుస్తారు. ఇది రేడియో సిగ్నల్స్ ద్వారా టెక్స్ట్ మెసేజెస్ స్వీకరించే చిన్న పరికరం. 90వ దశకంలో మొబైల్ ఫోన్‌లు రావడానికి ముందు పేజర్‌లను ముఖ్యంగా వైద్యులు, వ్యాపారవేత్తలు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేవారు. పేజర్ సాధనంలోని అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, దాన్ని ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం ఉండదు. పూర్తిగా రేడియో సిగ్నల్స్‌తో పనిచేస్తుంది.

పేజర్ ఎలా పని చేస్తుంది?
పేజర్ రేడియో ట్రాన్స్‌మిటర్ లాగా పనిచేస్తుంది. ఎవరైనా మీకు మెసేజ్ పంపాల్సి వచ్చినప్పుడు, ఆ మెసేస్ పేజర్ స్టేషన్‌కు ఫార్వర్డ్ చేయాలి. పేజర్ స్టేషన్ రేడియో తరంగాల ద్వారా ఈ సందేశాన్ని మీ పేజర్‌కి పంపుతుంది. మీ పేజర్ ఈ సందేశాన్ని స్వీకరించిన వెంటనే అది బీప్ చేయడం లేదా వైబ్రేట్ చేయడం ద్వారా మీకు తెలియజేస్తుంది.

ఎన్ని రకాల పేజర్లు ఉన్నాయి?
వన్-వే పేజర్, టూ-వే పేజర్, వాయిస్ పేజర్ వంటి మూడు రకాల పేజర్‌లు ఉన్నాయి. వన్-వే పేజర్ గురించి మాట్లాడితే ఈ రకమైన పేజర్‌లో మీరు మెసేజ్‌ను రిసీవ్ మాత్రమే చేసుకోగలరు. మీరు ఎలాంటి రిప్లై పంపలేరు. టూ-FO పేజర్‌లో మీరు సందేశాలను స్వీకరించడంతో పాటు రిప్లై కూడా ఇవ్వొచ్చు. మీరు వాయిస్ పేజర్‌లో వాయిస్ మెసేజెస్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు.

ఈ పేజర్ ఎంత సురక్షితమైనది?
పేజర్ల భద్రత, గోప్యతకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. పేజర్‌లో ఎన్‌క్రిప్షన్ లేకపోవడం అతిపెద్ద సమస్య. దీని అర్థం ఎవరైనా మీ పేజర్ సిగ్నల్‌ను సులభంగా అడ్డుకోవచ్చు. మీ సందేశాలను చదవచ్చు. లెబనాన్‌లో జరిగిన పేలుడులో కూడా అదే జరిగి ఉండవచ్చు. దాడి చేసిన వ్యక్తులు హెజ్బొల్లా సభ్యుల పేజర్లను హ్యాక్ చేసి, ఆపై పేలుడు పదార్థాలను అమర్చి ఉండవచ్చు. సులువుగా హ్యాకింగ్‌కు గురయ్యే పేజర్ ఎంత డేంజరో ఈ ఘటన రుజువు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories