Oppo A5 Pro: ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ లీక్

Oppo A5 Pro
x

Oppo A5 Pro

Highlights

Oppo A5 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో త్వరలో కొత్త ఫోన్ విడుదల చేయనుంది. ఈ ఫోన్ మోడల్ నంబర్ PKP110. ఈ సర్టిఫికేషన్‌లో ఉన్న ఫోన్ ఫోన్ ఫోటోలను బట్టి ఇది కంపెనీకి చెందిన A సిరీస్ ఫోన్ అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు.

Oppo A5 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో త్వరలో కొత్త ఫోన్ విడుదల చేయనుంది. ఈ ఫోన్ మోడల్ నంబర్ PKP110. ఈ సర్టిఫికేషన్‌లో ఉన్న ఫోన్ ఫోన్ ఫోటోలను బట్టి ఇది కంపెనీకి చెందిన A సిరీస్ ఫోన్ అయి ఉండవచ్చని ఊహిస్తున్నారు. ఇప్పుడు ఈ రాబోయే ఫోన్ TENAA సర్టిఫికేషన్‌లో రిజిస్టర్ అయింది. దీని ద్వారా ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ ఒప్పో A5 ప్రోగా చైనాలోకి లాంచ్‌కావచ్చని లీక్స్ చెబుతున్నాయి. TENAA లిస్టింగ్ ప్రకారం కంపెనీ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో డిస్‌ప్లేను అందించబోతోంది.

TENAA జాబితా ప్రకారం.. Oppo A5 Pro (PKP110) సైజు 161.5 x 74.85 x 7.67mm. రాబోయే ఈ ఫోన్ బరువు 186 గ్రాములు. కంపెనీ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి + కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించబోతోంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించబోతోంది. కంపెనీ ఈ ఫోన్‌ను 8 GB + 256 GB, 2 GB + 512 GB అనే రెండు వేరియంట్‌లలో లాంచ్ చేయబోతోంది. ప్రాసెసర్‌గా మీరు దానిలో డైమెన్షన్ 7300 చిప్‌సెట్‌ని చూడవచ్చు.

ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలను తీసుకురానుంది. వీటిలో 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ఉంటుంది. అదే సమయంలో మీరు సెల్ఫీ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడచ్చు. కంపెనీ దానిలో 6000mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. OS గురించి మాట్లాడితే ఫోన్ ColorOS 15లో Android 15లో పని చేస్తుంది. వాటర్, డస్ట్ ప్రొటక్షన్ కోసం ఒప్పో ఈ ఫోన్‌లో IP69 రేటింగ్‌ సపోర్ట్ ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories