OPPO K12x 5G: రూ.10 వేలకే ఒప్పో కొత్త ఫోన్.. కింద పడ్డా ఏం కాదంటా.. అట్రాక్ట్ చేస్తున్నఫెదర్ పింక్ కలర్..!

Oppo K12x 5G Feather Pink
x

Oppo K12x 5G Feather Pink

Highlights

OPPO K12x 5G: ఒప్పో K12x 5G ఫెదర్ పింక్ వెర్షన్ లాంచ్ చేసింది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు.

OPPO K12x 5G: దసరా, దీపావళి పండగల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో భారతదేశంలో మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో కూడిన 5G స్మార్ట్‌ఫోన్ OPPO K12x 5G కొత్త కలర్ వేరియంట్ ఫెదర్ పింక్ కలర్‌ లాంచ్ చేసింది. గతంలో ఈ ఫోన్‌ను బ్రీజ్ బ్లూ, మిడ్‌నైట్ వైలెట్ కలర్ ఆప్షన్‌లలో విడుదలైంది. ఇది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో అమ్మకానికి అందుబాటులోకి రానుంది. ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఒప్పో K12x 5G ఫెదర్ పింక్ వెర్షన్ ధర రూ. 12,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 6, 2024 వరకు లిమిటెడ్ ఆఫర్‌తో కేవలం రూ. 10,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్‌ల కోసం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుండి లైవ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లలో ఎటువంటి మార్పు లేదు.

ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల (1604 x 720 పిక్సెల్‌లు) HD+ స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, పాండా గ్లాస్ ప్రొటక్షన్ కలిగి ఉంది. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 6nm ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది ARM Mali-G57 MC2@1072MHz GPUతో లింకై ఉంటుంది. ఫోన్ 6GB/8GB RAM+128GB/256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంది. మైక్రో SDతో 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది Android 14 కలర్ OS 14లో రన్ అవుతుంది.

కెమెరా గురించి మాట్లాడితే OPPO K12x 5G GC32E2 సెన్సార్, f/1.8 ఎపర్చరుతో కూడిన 32MP మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఇది GC02M1B సెన్సార్, f/2.4 ఎపర్చర్‌తో 2MP పోర్ట్రెయిట్ సెన్సార్‌తో ఉంటుంది. ఇందులో LED ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీ కోసం ఇది f/2.05 ఎపర్చరు, GC08A8-WA1XA సెన్సార్‌తో 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్, 5G NA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS + GLONASS ఉన్నాయి. , USB టైప్-C వంటి కనెక్టివిటీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories