OnePlus Ace 5 Pro: అదరకొట్టారు.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. డిజైన్ అదుర్స్..!

OnePlus Ace 5 Pro
x

OnePlus Ace 5 Pro

Highlights

OnePlus Ace 5 Pro: వన్‌ప్లస్ Ace 5 Pro స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్‌లో లాంచ్ చేయనుంది. ఇది BOE X2 ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది.

OnePlus Ace 5 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ OnePlus చైనాలో ఈ ఏడాది నవంబర్‌లో OnePlus 13ని పరిచయం చేయనుంది. అలానే OnePlus Ace 5 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ ఏడాది డిసెంబర్‌లో Q4లో విడుదల అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌ ఉంటుంది. OnePlus Ace 5 Pro కూడా అదే ప్రాసెసర్‌‌తో వస్తుందని లీక్స్ వస్తున్నాయి. OnePlus 13ని ఫోటోగ్రఫీపై కోసం స్పెషల్‌గా డిజైన్ చేశారు. ఈ క్రమంలో డిజిటల్ చాట్ స్టేషన్ దీని గురించి కొంత సమాచారాన్ని వెల్లడించారు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

OnePlus Ace 5 Pro Specifications
లీక్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్ పేరును డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించలేదు. అయితే ఇది వన్‌ప్లస్ ఏస్ 5 ప్రో కావచ్చునని టాక్ వినిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్ SM8750 చిప్‌తో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్. OnePlus Ace 5 Pro 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్‌తో BOE X2 ఫ్లాట్ డిస్‌ప్లేతో హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్‌గా ఉంటుందని లీక్ పేర్కొంది. ఇది రైట్ యాంగిల్ మెటల్ మిడిల్ ఫ్రేమ్‌తో వస్తుంది.

OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్ ఛాసిస్ గ్లాస్ లేదా సిరామిక్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది బ్యాక్ కవర్, మిడిల్ ఫ్రేమ్ మధ్య చాంఫెర్డ్ కార్నర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్‌లో చాలా మార్పులు ఉంటాయి. స్పెసిఫికేషన్ల గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు.

OnePlus Ace 5తో పోల్చిచూస్తే మైక్రో కర్వ్ డిజైన్‌తో 6.78-అంగుళాల 8T LTPO డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,200mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఇందులో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా అలర్ట్ స్లైడర్ ఫీచర్ కూడా ఉంటుందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories