OnePlus 13 Launch: అప్పుడే వచ్చేసింది.. 6000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

OnePlus 13 Launch
x

OnePlus 13 Launch

Highlights

OnePlus 13 Launch: 6000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ 13 సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. దీని ఫీచర్లు, ధర లీక్ అయ్యాయి.

OnePlus 13 Launch: ఫేమస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ దేశంలో త్వరలో వన్‌ప్లస్ 13 సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. తాజా నివేదికల ప్రకారం కంపెనీ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 13ని వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. OnePlus 13 చైనా మార్కెట్‌లో లాంచ్ కానుంది. క్రమంగా బ్రాండ్‌కు బలమైన పట్టు ఉన్న భారతదేశంతో సహా మార్కెట్‌లలో లాంచ్ అవుతుంది. OnePlus 12 కూడా డిసెంబర్ విడుదల కానుంది. అయితే OnePlus 13 Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌‌తో వస్తుంది. దీన్ని హవాయిలో జరిగే స్నాప్‌డ్రాగన్ సమ్మిట్‌లో అధికారికంగా ప్రకటించారు.

ఇంటర్నెట్‌లోని సమచారం ప్రకారం.. OnePlus 13 అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ నెల ప్రారంభంలో లాంచ్ అవుతుంది. చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ Weibo OnePlus 13కి సంబంధించి కొంత సమాచారాన్ని లీక్ చేసింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌తో రావచ్చు. లీక్‌ల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీతో వచ్చే మొదటి ఫోన్ కావచ్చు. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌తో రావచ్చు.

ఫోన్‌లో ఇటీవలే లాంచ్ అయిన హానర్ 200 ప్రోలో కనిపించిన క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కనీసం 120 Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.7/6.8-అంగుళాల 2K డిస్‌ప్లేను పొందవచ్చు. ఈ డిస్‌ప్లే దాని ముందు మోడల్‌తో పోలిస్తే మరింత బ్రైట్‌నెస్,బెటర్ కలర్ ఆక్యురసీని అందిస్తుంది.

ఈ ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే ఇది 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. ఈ అప్‌గ్రేడ్‌లు ఈ సంవత్సరం OnePlus 13 సిరీస్ ధరను పెంచే అవకాశం ఉంది. అయితే భారతదేశంలో ఈ ఫోన్ ధర దాదాపు రూ. 70,000 ఉండవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories