Oneplus 13 Price: 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా.. 'వన్‌ప్లస్‌ 13' ధర, లాంచ్ డీటెయిల్స్ ఇవే!

Oneplus 13 Launch: Oneplus 13 5g Smartphone Launch and Price in India
x

Oneplus 13 Price: 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా.. 'వన్‌ప్లస్‌ 13' ధర, లాంచ్ డీటెయిల్స్ ఇవే..!

Highlights

Oneplus 13 Launch: ఇటీవలి కాలంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ 'వన్‌ప్లస్‌' వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Oneplus 13 Launch: ఇటీవలి కాలంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ 'వన్‌ప్లస్‌' వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌ 11, వన్‌ప్లస్‌ 12 సహా నార్డ్‌ సిరీస్‌లో సీఈ 4, సీఈ 4 లైట్ ఫోన్‌లను విడుదల చేసింది. వీటన్నింటి సేల్స్ అద్భుతంగా ఉన్నాయి. తాజాగా 'వన్‌ప్లస్‌ 13'ను లాంచ్ చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌, ట్రిపుల్ ప్రైమరీ కెమెరా సెటప్, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. చైనాలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది.

వన్‌ప్లస్‌ కంపెనీ అధికారికంగా గ్లోబల్, భారత్ లాంచ్ తేదీని ధృవీకరించనప్పటికీ.. వచ్చే సంవత్సరం ప్రారంభంలో వన్‌ప్లస్‌ 13 రిలీజ్ కానుందని తెలుస్తోంది. భారత్‌లో వన్‌ప్లస్‌ 12ని గత జనవరిలో రిలీజ్ చేసింది. కాబట్టి వన్‌ప్లస్‌ 13 కూడా జనవరి 2025 నాటికి వస్తుందని భావిస్తున్నారు. చైనాలో వన్‌ప్లస్‌ 13 బేస్‌ వేరియంట్‌ 12జీబీ+256 జీబీ స్టోరేజీ ధర 4,499 యువాన్లుగా కంపెనీ నిర్ణయించింది. భారత్ కరెన్సీలో సుమారు రూ.53,111. 24జీబీ+1టీబీ టాప్ వేరియంట్‌ ధర 5,999 యువాన్లుగా ఉండగా.. మన కరెన్సీలో రూ.70,819గా ఉంది. 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర 4899 యువాన్లుగా.. 16జీబీ+512జీబీ వేరియంట్‌ ధర 5299 యువాన్లుగా వన్‌ప్లస్‌ నిర్ణయించింది. భారతదేశంలో బేస్‌ వేరియంట్‌ను రూ.65,000కి రిలీజ్ చేస్తారని అంచనా.

వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 15 కలర్‌ ఓఎస్‌ 15తో వచ్చింది. అయితే గ్లోబల్‌గా ఆక్సిజన్‌ ఓఎస్‌15తో రానుంది. 6.82 ఇంచెస్ క్వాడ్‌ హెచ్‌ ప్లస్ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ ఫోన్ సొంతం. డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్‌ను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌, 840 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో రానుంది. డాల్బీ విజన్‌ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫొటో లెన్స్‌ను ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇందులో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 100 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

కీ ఫీచర్స్:

# ఆక్సిజన్‌ ఓఎస్‌15

# 6.82 ఇంచెస్ క్వాడ్‌ హెచ్‌ ప్లస్ ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే

# 840 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌

# ఐపీ68, ఐపీ69 రేటింగ్‌

# 50 ఎంపీ ప్రైమరీ కెమెరా

# 32 ఎంపీ సెల్ఫీ కెమెరా

# 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Show Full Article
Print Article
Next Story
More Stories