POCO Phone Sale: పోకో అరాచకం బాబోయ్.. ఈ ఆరు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. పోతే రావు బాబు..!
POCO Phone Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా పోకో స్మార్ట్‌ఫోన్లపై రూ. 8000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
POCO Phone Sale: పోకో ఇండియా బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులో ఉన్న తగ్గింపులను ఎట్టకేలకు వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ BBD (బిగ్ బిలియన్ డేస్) సేల్ సెప్టెంబర్ 27 నుండి అందరికీ ప్రారంభమవుతుంది. పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్ స్వయంగా ట్వీట్ చేయడం ద్వారా ఫోన్ తగ్గింపు ధరను వెల్లడించారు. ఈ Poco ఫోన్‌లపై మీరు రూ. 8000 వరకు తగ్గింపు పొందుతారు. కాబట్టి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో ఏ పోకో ఫోన్‌లపై ఎంత తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం
1.POCO M6 5G
ఈ సేల్‌లో POCO అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ POCO M6 5G. ఈ ఫోన్ కొనుగోలుదారులకు కేవలం రూ.7,499కే అందుబాటులో ఉంటుంది. 8,999 ధరకు ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ 5G కనెక్టివిటీతో వచ్చే అత్యంత సరసమైన హ్యాండ్‌సెట్. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
🚀✨ The wait is over! POCO pricing is here, and it’s even better than expected! 🙌 What do you think? Let me know in the comments! 🔥📱 Time to snag your favorites now! 💥 #POCO #BBD #TechDeals pic.twitter.com/2rpDo9Upoj
— Himanshu Tandon (@Himanshu_POCO) September 18, 2024
2. POCO M6 Plus 5G
మీరు POCO M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌ను సేల్ నుంచి కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఫోన్ రూ. 10,999 ధరకు అందుబాటులో ఉంటుంది. 12,999 ధరకు ఈ ఫోన్ లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవలే భారత్‌లోకి వచ్చింది. POCO M6 ప్లస్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 108MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా అందించారు. ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ 5030mAh బ్యాటరీని కలిగి ఉంది.
3. POCO X6 Neo 5G
POCO X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ రూ. 11,999కి సేల్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేశారు. ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14లో రన్ అవుతుంది. దీనికి రెండు ముఖ్యమైన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది.
4. POCO X6 5G
పోకో X6 5G స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు కూడా ఉంది. POCO X6 5G స్మార్ట్‌ఫోన్‌ను BBD సేల్‌లో రూ. 14,999కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో నడుస్తుంది. Poco X6 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో 64MP ప్రైమరీ, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 8GB RAM + 256GB స్టోరేజ్ ఉంటుంది. ఫోన్‌ని రూ. 19,999కి విడుదల చేయబడింది.
5. POCO F6 5G
POCO F6 5G స్మార్ట్‌ఫోన్ రూ. 21,999కి సేల్‌లో ఉంది. దీన్ని మేలో భారతదేశంలో ప్రారంభించారు. ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్, 20MP సెల్ఫీ కెమెరా ఉంది. పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Pocoఈ ఫోన్ 29,999 రూపాయల ధరతో విడుదల చేసింది.
6. POCO X6 Pro 5G
ఈ Poco స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 OS అప్‌గ్రేడ్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. ఫోటోగ్రఫీ కోసం Poco X6 ప్రోలో 64MP OIS ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Poco 8GB RAM + 256TB స్టోరేజ్ ఫోన్ రూ. 24,999కి విడుదల చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire