తక్కువ ధరల్లో నోకియా కొత్త ఫోన్లు.. సీఈఎస్ 2022లో రిలీజ్ చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Nokia Launched New Phones in CES 2022 Features and Price Details | Technology News
x

తక్కువ ధరల్లో నోకియా కొత్త ఫోన్లు.. సీఈఎస్ 2022లో రిలీజ్ చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Highlights

CES 2022: నోకియా ఐదు కొత్త పాకెట్-ఫ్రెండ్లీ ఫోన్‌లను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2022లో విడుదల చేసింది...

CES 2022: నోకియా ఐదు కొత్త పాకెట్-ఫ్రెండ్లీ ఫోన్‌లను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) 2022లో విడుదల చేసింది. నోకియా లైసెన్సీ HMD గ్లోబల్ నుంచి వచ్చిన ఫోన్‌లలో Nokia C100, Nokia C200, Nokia G100, Nokia G400, Nokia 2760 ఫ్లిప్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో Android 12 ఓఎస్‌పై ఆధారపడి తయారు చేసిన KaiOS ఓఎస్‌తో నడవనున్నాయి. నోకియా సీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ చిప్‌సెట్‌లతో పనిచేయనున్నాయి. నోకియా జీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లతో విడుదల కానున్నాయి. వీటిలో, నోకియా G400 మాత్రమే 5G కనెక్టివిటీని సఫోర్ట్ చేయనుంది.

Nokia C100, Nokia C200, Nokia G100, Nokia G400, Nokia 2760 ఫ్లిప్ ధరలపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదించిన వివరాల ప్రకారం , నోకియా C100 ధర $99 (దాదాపు రూ. 7,400), నోకియా C200 $119 (దాదాపు రూ. 8,900)కి అందుబాటులో ఉండనుంది. మరోవైపు, Nokia G100 ధర $149 (దాదాపు రూ. 11,100), Nokia G400 $239 (దాదాపు రూ. 17,800)కి అందుబాటులో ఉంటుంది. నోకియా 2760 ఫ్లిప్ $79 (సుమారు రూ. 5,900)కి లభించనుంది.

నోకియా సి100, నోకియా సి200 స్పెసిఫికేషన్లు..

బడ్జెట్ ఫ్రెండ్లీ Nokia C100, Nokia C200 ఆండ్రాయిడ్ 12తో పనిచేయనున్నాయి. ఇది 5.45-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండోది 6.1-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే, రెండో ఫోన్లలో వెనకాల 8-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో రానున్నాయి. Nokia C200 4,000mAh బ్యాటరీతో విడుదల కానుండగా, Nokia C100 3,000mAh బ్యాటరీతో పవర్ ఇవ్వనుంది.

Nokia G100, Nokia G400 స్పెసిఫికేషన్స్

Nokia G100 6.5-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు Qualcomm Snapdragon 615 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పవర్ బటన్‌లో ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఇది 5,000mAh బ్యాటరీని ప్యాక్‌తో రానుంది.

మరోవైపు, Nokia G400 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 6GB RAM, 128GB స్టోరేజ్‌తోపాటు Qualcomm Snapdragon 480 SoCతో నడవనుంది. ఇది 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, మాక్రో లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

నోకియా 2760 ఫ్లిప్ స్పెసిఫికేషన్స్..

HMD గ్లోబల్‌లో వివరాల మేరకు నోకియా 2760 ఫ్లిప్ ఫోన్ KaiOSతో పనిచేయనుంది. 4G LTE నెట్ వర్క్‌ను సపోర్ట్ చేయనుంది. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫీచర్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ వంటి పరిమిత స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను అందిస్తుంది. ఇది 55 సంవత్సరాలు, ఆపై ఎక్కువ వయస్సు గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇది సెకండరీ డిస్‌ప్లే, కాల్, షేర్ లొకేషన్ బటన్‌‌లను పొందుపరిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories