నాసా మూన్ మిషన్ 'ఆర్టెమిస్ 1' లాంచ్ వాయిదా.. హైడ్రోజన్ లీకేజీతో కౌంట్‌డౌన్ నిలిపివేత
Artemis-1: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ ఆర్టెమిస్ 1 ప్రయోగానికి బ్రేక్ పడింది.
Artemis-1: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక మూన్ మిషన్ ఆర్టెమిస్ 1 ప్రయోగానికి బ్రేక్ పడింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ఇంజిన్‌లో హైడ్రోజన్ లీక్‌తో సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. T-40 నిమిషాల వద్ద కౌంట్‌డౌన్ నిలిపివేసినట్లు నాసా తెలిపింది. దీంతో సెప్టెంబర్ 9న తిరిగి మరోసారి ప్రయోగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం.. అపోలో తర్వాత చంద్రుడిపైకి నాసా ప్రయోగం చేస్తోంది. ఇంతకు ముందులా కాకుండా చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాదులు వేస్తోంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. ప్రస్తుతానికి డమ్మీ మనుషులతో ఆర్టెమిస్-1 ప్రయోగం జరుగుతోంది. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా.. ఆర్టెమిస్-2, -3లు పూర్తిగా మానవ సహితంగానే జరగనున్నాయి.
The launch of #Artemis I is no longer happening today as teams work through an issue with an engine bleed. Teams will continue to gather data, and we will keep you posted on the timing of the next launch attempt. https://t.co/tQ0lp6Ruhv pic.twitter.com/u6Uiim2mom
— NASA (@NASA) August 29, 2022
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire