Motorola Moto G71 5G: జనవరి 10న రిలీజ్ కానున్న మోటరోలా కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Motorola Moto G71 5G: జనవరి 10న రిలీజ్ కానున్న మోటరోలా కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
x

Motorola Moto G71 5G: జనవరి 10న రిలీజ్ కానున్న మోటరోలా కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Highlights

Motorola Moto G71 5G భారత మార్కెట్‌లోకి విడుదలయ్యాక ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Motorola Moto G71 5G: మోటరోలా కొత్త ఫోన్ Motorola Moto G71 5G ఇండియాలో లాంచ్ తేదీ వచ్చేసింది. ఈ నూతన ఫోన్ జనవరి 10న మనదేశంలో విడుదల కానున్నట్లు చైనా కంపెనీ మంగళవారం ధృవీకరించింది. Motorola ఫోన్ గతేడాది నవంబర్‌లో యూరప్‌లో రిలీజ్ అయింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరాలు, హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్‌తో సహా మరెన్నో ఫీచర్లతో వస్తుంది. Moto G71 5G కూడా కొత్తగా విడుదలైన Qualcomm Snapdragon 695 SoC ప్రాసెసర్‌తో విడుదల కానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఈ స్మార్ట్‌ఫోన్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ మద్దతు ఇస్తుంది.

ఈ మేరకు Motorola Moto G71 5G విడుదల తేదీని మోటరోలా ఇండియా ట్విట్టర్ హ్యాండిల్‌లో ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మనదేశంలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

Motorola Moto G71 5G ధర..

Motorola Moto G71 5G ఫోన్ మనదేశంలో ఎంత ఉంటుందనేది ఇంకా తెలియదు. అయితే ఐరాపాలో ఈ ఫోన్ ధర EUR 299.99 (సుమారు రూ. 25,200)లుగా ఉంది. ఇది Moto G200, Moto G51, Moto G41, Moto G31 వంటి మోడళ్లతో పాటు విడుదలైంది. Moto G51, Moto G31 లాంటి ఫోన్ల గ్లోబల్ లాంచ్ తర్వాత భారత మార్కెట్‌లోకి విడుదల కానుంది.

Motorola Moto G71 5G స్పెసిఫికేషన్స్..

డ్యూయల్-సిమ్ (నానో)తో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ Android 11 తో పనిచేసే My UX కస్టమ్ స్కిన్‌తో నడుస్తుంది. ఇది 6.4-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) మాక్స్ విజన్ OLED డిస్‌ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియోతోపాటు 60Hz రిఫ్రెష్ రేట్‌తో అలరించనుంది. ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 SoC తో విడుదల కానుంది. ఇందులో 8GB RAM వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. Moto G71 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తోపాటు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌, f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం Motorola Moto G71 5Gలో 16-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా సెన్సార్‌ను అందించారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా f/2.2 లెన్స్‌తో జత చేశారు.

Moto G71 5G 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో రానుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌లను కలిగి ఉంది. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. TurboPower 30 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో విడుదల కానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories