Moto Edge 50: త‌క్కువ ధ‌ర‌లో ఊహ‌కంద‌ని ఫీచ‌ర్లు.. మోటోరోలా నుంచి క‌ళ్లు చెదిరే ఫోన్..!

Motorola new phone moto edge 50 sales begains from august 8th Check here for full details
x

Moto Edge 50: త‌క్కువ ధ‌ర‌లో ఊహ‌కంద‌ని ఫీచ‌ర్లు.. మోటోరోలా నుంచి క‌ళ్లు చెదిరే ఫోన్ 

Highlights

Moto Edge 50: త‌క్కువ ధ‌ర‌లో ఊహ‌కంద‌ని ఫీచ‌ర్లు.. మోటోరోలా నుంచి క‌ళ్లు చెదిరే ఫోన్

Moto Edge 50: ఇటీవ‌ల మార్కెట్లోకి వ‌రుసగా కొత్త స్మార్ట్ ఫోన్‌ల‌ను లాంచ్ చేస్తూ వస్తున్న మోటోరోలా తాజాగా భార‌త మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుద‌ల చేసింది. మిడ్ రేంజ్ బ‌డ్జెట్‌లో అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మోటో ఎడ్జ్ 50 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయి.? ధ‌ర ఎంత‌.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటో ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్‌లోను పీఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ను కోలా గ్రే, జంగిల్ గ్రీన్, పెంటన్ పీచ్ ఫజ్ వంటి క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను కేవ‌లం ఒక‌టే వేరియంట్‌లో తీసుకొచ్చారు. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధ‌ర రూ. 27,999గా నిర్ణ‌యించారు. ఆగ‌స్టు 8వ తేదీ నుంచి ఈ ఫోన్ అమ్మ‌కాలు ప్రారంభంకానున్నాయి. మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు, ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇక ప‌లు బ్యాంకుల‌కు చెందిన క్రెడిట్ కార్డుల‌తో కోనుగోలు చేసే ఈ ఫోన్‌పై అద‌నంగా రూ. 2000 డిస్కౌంట్ ల‌భిస్తుంది. అలాగే కొన్ని బ్యాంకుల‌కు చెందిన డెబిట్ కార్డ్‌ల ద్వారా 9 నెలల వరకు నో కాస్ట్ EMI ఆప్ష‌న్ పొందొచ్చు.

ఇక ఈ ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన క‌ర్వ్డ్ పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. 1.5కే రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ఫోన్ క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ 7 జెన్ 1 ప్రాసెస‌ర్‌తో తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఇచ్చారు. కెమెరా విష‌యానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక బ్యాట‌రీ విష‌యానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు స‌పోర్ట్ చేసే 5000 ఎమ్ఏహెచ్ బ్యాట‌రీని అందించారు. 68 వాట్స్ ట‌ర్బో ప‌వ‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories