Motorola: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

Motorola: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..
x

Motorola: ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..

Highlights

మోటరోలా MIL-810తో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నాయి. కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్‌ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మోటరోలా MIL-810తో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత పలుచని స్మార్ట్‌ఫోన్‌గా దీన్ని తీసుకొస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఈ విషయమై మోటోరోలా ఎక్స్‌ వేదికగా టీజర్‌ను విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మోటరోలో ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

మోటోరోలా ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌ను గ్రే, బ్లూ, పోయిన్సియానా, మిల్క్‌ వైట్ కలర్స్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫోన్‌ను చాలా స్ట్రాంగ్ బాడీతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొరపాటు పై నుంచి పడినా ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఎక్కువ వేడి నుంచి కూడా తట్టుకునేలా దీన్ని డిజైన్‌ చేయనున్నారు. విపరీతమైన చలి ఉండే ప్రదేశాల్లోనూ ఫోన్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

ఇక ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన పీఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ధర విషయానికి సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories