Moto G05 Launch: రూ.6999కే అదిరిపోయే ఫీచర్లు.. బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన మోటో

Moto G05 Launch
x

Moto G05 Launch

Highlights

Moto G05 Launch: మోటరోలా 2025లో తన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ Moto G05ని భారతదేశంలో విడుదల చేసింది.

Moto G05 Launch: మోటరోలా 2025లో తన మొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ Moto G05ని భారతదేశంలో విడుదల చేసింది. G-సిరీస్ కంపెనీ నుండి అత్యంత విజయవంతమైన సిరీస్‌లలో ఒకటి, ఇది బడ్జెట్-ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా అనేక ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది. ఫోన్‌ పెద్ద 6.67-అంగుళాల డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఫోన్ వెనుక ప్యానెల్‌ వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది. మల్టీ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

మోటో G05 ధర

మోటో G05 ధర రూ. 6,999. ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని సేల్ జనవరి 13, 2025 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ Flipkart, Motorola.in, ప్రధాన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయచ్చు. ఇది రెండు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. అందులో ఫారెస్ట్ గ్రీన్, ప్లం రెడ్ ఉన్నాయి. ఇది వేగన్ లెదర్ డిజైన్‌తో వస్తుంది.

మోటో G05 ఫీచర్స్

మోటో ఈ స్మార్ట్‌ఫోన్ 1000-నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని డిజైన్ స్లిమ్, నాచ్-లెస్. ఇది గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ అందించారు. మోటరోలా తన సెగ్మెంట్లో ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది సూర్యకాంతిలో కూడా విభిన్నమైన ప్రదర్శనను అందిస్తుంది. అదనంగా కంటెంట్‌పై ఆధారపడి సొంతంగా 90Hz నుండి 60Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అడ్జస్ట్ చేస్తుంది. ఇది బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. హై-రెస్ ఆడియో ద్వారా డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే వాటర్ టచ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది, ఇది తడి లేదా చెమటతో ఉన్న చేతులకు సున్నితత్వాన్ని సర్దుబాటు చేస్తుంది. ఫోన్ IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది నీరు, దుమ్ము నుండి రక్షణను అందిస్తుంది.ఆండ్రాయిడ్ 15తో వస్తున్న భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.

కెమెరా గురించి మాట్లాడితే Moto G05 50-మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, నైట్ విజన్ మోడ్‌తో వస్తుంది. ఇది కాకుండా 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది, ఇది ఫేస్ రీటచ్‌తో ​స్పష్టమైన, మెరుగైన సెల్ఫీలను అందిస్తుంది. ఫోన్‌లో పోర్ట్రెయిట్, టైమ్ లాప్స్, లైవ్ ఫిల్టర్, పనోరమా, లెవలర్ వంటి మల్టీ కెమెరా మోడ్‌లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా గూగుల్ ఫోటో ఎడిటర్, మ్యాజిక్ అన్‌బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎడిటర్ వంటి టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories