Motorola: 30 నిమిషాలు నీటిలో ఉన్నా ఏం కాదు.. మోటోరోలా నుంచి స్టన్నింగ్ ఫోన్‌

Motorola launched best water resistance phone in low budget Moto edge 40 neo 5g features and price details
x

Motorola: 30 నిమిషాలు నీటిలో ఉన్నా ఏం కాదు.. మోటోరోలా నుంచి స్టన్నింగ్ ఫోన్‌ 

Highlights

Motorola: మోటోరోలా ఎడ్జ్ 40‌ నియో 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను అందించారు.

Motorola: ప్రస్తుతం వాటర్‌ రెసిస్టెంట్‌ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. నీటిలో తడిచినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాటర్‌ రెసిస్టెంట్ ఫోన్‌ల ధరలు భారీగా ఉంటాయనే విషయం తెలిసిందే. అయితే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం మోటోరోలా తాజాగా తక్కువ బడ్జెట్‌లో వాటర్‌ రెసిస్టెంట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటా ఫోన్‌.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మోటోరోలా ఎడ్జ్ 40‌ నియో 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్‌ సుమారు 30 నిమిషాల పాటు నీటిలో మునిగిన తర్వాత కూడా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. వర్షంలో కూడా ఈ స్మార్ట్‌ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో మంచి సౌండ్ కోసం రెండు స్పీకర్లను అందించారు. ఇందులో 68 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 15 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.

ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే.. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 23,999కాగా, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ధ రూ. 25,999గా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై రూ. 1000 డిస్కౌంట్‌ లభిస్తోంది. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా రూ. 3000 డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌తో కూడిన పీఓల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్షన్‌ 7030 ప్రాసెసర్‌ను అందించారు. దీని డిస్‌ప్లే 1300 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ పోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు, అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories