Motorola ThinkPhone 25: థింక్‌షీల్డ్‌తో మోటో కొత్త ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఏఐ ఫీచర్లు!

Motorola ThinkPhone 25
x

Motorola ThinkPhone 25

Highlights

Motorola ThinkPhone 25: Motorola ThinkPhone 25 స్మార్ట్‌ఫోన్‌లో థింక్‌షీల్డ్ భద్రత, మూడు సంవత్సరాల వారంటీ, Moto AI, 5 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్, MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ బాడీ కూడా ఉన్నాయి.

Motorola ThinkPhone 25: మోటరోలా కంపెనీ తాజాగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మోటరోలా థింక్‌ఫోన్ సిరీస్‌లో Motorola ThinkPhone 25 పేరుతో ఈ మొబైల్ గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైంది. ఈ ఫోన్ గతేడాది లాంచ్ చేసిన ఫోన్‌కు సక్సెసర్. ఇది కేవలం ఒక స్టోరేజ్ ఆప్షన్‌లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6.36-అంగుళాల పోలరైజ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 8GB RAM, 4310mAh బ్యాటరీ, 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

మోటరోలా థింక్‌‌ఫోన్ 25 స్మార్ట్‌ఫోన్‌లో థింక్‌షీల్డ్ భద్రత, మూడు సంవత్సరాల వారంటీ, Moto AI, 5 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్, MIL-STD 810H మిలిటరీ-గ్రేడ్ బాడీ కూడా ఉన్నాయి. స్మార్ట్ కనెక్ట్ ఫీచర్‌తో థింక్‌ఫోన్‌ను పిసికి కనెక్ట్ చేయవచ్చు. ఫైల్‌లను సులభంగా షేర్ చేయవచ్చు. ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో దాదాపు రూ. 41,800 (సుమారు US $ 499)కి విడుదల చేశారు. నవంబర్ ప్రారంభం నుండి ఈ ఫోన్ సేల్‌కు రానుంది. మీరు కొత్త Motorola ఫోన్‌ను కార్బన్ బ్లాక్‌లో కొనుగోలు చేయవచ్చు.

Motorola ThinkPhone 25 Features

మోటరోలా థింక్‌ఫోన్ 25 మొబైల్ 6.36 అంగుళాల పోలరైజ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, గరిష్టంగా 3,000 నిట్‌ల బ్రైట్నెస్, 2670 x 1220 రిజల్యూషన్‌ని కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i డిస్ప్లే రక్షణ కోసం అందించారు. MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో కంపెనీ ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. గేమింగ్ ప్రియులకు ఇది మంచి ఎంపిక అవుతుంది. ఈ మొబైల్ 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌తో రన్ అవుతుంది.

ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అందుబాటులో ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 4,310mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. దీన్ని ఛార్జ్ చేయడానికి 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి. బ్లూటూత్ 5.3, NFC, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో కూడిన డాల్బీ అట్మోస్, Wi-Fi 6E, IP68 రేటింగ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories