Motorola Edge 50 Neo: భలే మంచి ఫోన్.. కింద పడ్డా పగలదు, నీటిలో నిండా మునిగిన పాడవదు.. ఏం టెక్నాలజీ సామీ ఇది..!

Motorola Edge 50 Neo
x

Motorola Edge 50 Neo

Highlights

Motorola Edge 50 Neo: మోటరోలా ఎడ్జ్ 50 నియోను భారతదేశంలో విడుదల చేసింది. సెప్టెంబర్ 24 సేల్‌కి వస్తుంది. 22,999 రూపాయలతో కొనుగోలు చేయవచ్చు.

Motorola Edge 50 Neo: మోటరోలా కంపెనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 నియోను భారతదేశంలో విడుదల చేసింది. అనేక AI ఫీచర్లు, ప్రీమియం లుక్‌తో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌లో మీరు 8GB RAMతో 6.4 అంగుళాల సూపర్ HD AMOLED డిస్‌ప్లే చూస్తారు. Pantone కలర్స్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కంపెనీ ఎడ్జ్ సిరీస్‌లో వస్తున్న చాలా స్టైలిష్ ఫోన్ ఇది. మీరు ఈ ఫోన్‌ని ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ మొదటి సేల్‌ సెప్టెంబర్ ౨౪న ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ నాలుగు పాంటోన్ కలర్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో నాటికల్ బ్లూ, లాట్, గ్రిసైల్, పోయిన్సియానా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ప్రీమియం వేగన్ లెదర్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. డిస్కౌంట్ ఆఫర్ తర్వాత కంపెనీ Flipkartలో ఫోన్ 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 22,999. కంపెనీ ఈ ఫోన్ లాంచింగ్ ధరను రూ.23,999గా నిర్ణయించింది. కంపెనీ దీనిని ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసింది. లాంచ్‌తో కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్‌లను ఇస్తోంది. ఆ తర్వాత మీరు ఈ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.4 అంగుళాల సూపర్ HD AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 2800 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7300 చిప్‌సెట్ ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కంపెనీ 8 జీబీ ర్యామ్, 56 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఫోన్‌ను విడుదల చేసింది.

కెమెరా గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్ వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో మూడు కెమెరా సెటప్‌ను అందిస్తోంది. దీనిలో మీరు 10MP టెలిఫోటో లెన్స్ కెమెరాతో పాటు 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం కంపెనీ 32MP ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. పవర్ కోసం ఫోన్‌లో 68W టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4310mAh బ్యాటరీని అందించింది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0, వైఫై 6E వంటి అనేక ఫీచర్లను ఫోన్‌లో అందించింది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories