Motorola Edge 50 Neo: మళ్లీ తోపు ఫోన్లు.. మోటో నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు.. చాలా స్పీడ్..!

Motorola Edge 50 Neo
x

Motorola Edge 50 Neo

Highlights

Motorola Edge 50 Neo: మోటరోలా ఎడ్జ్ 50 నియో, థింక్‌ఫోన్ 25ని త్వరలో లాంచ్ చేయనున్నాయి. వీటీ ఫీచర్లు లీక్ అయ్యాయి.

Motorola Edge 50 Neo: టెక్ దిగ్గజ కంపెనీ మోటరోలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్‌లతో మార్కెట్‌లో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే తన బ్రాండ్ నుంచి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో Edge 50 Neoని విడుదల చేయనుంది. ఇది ఎడ్జ్ 40 నియోకి సక్సెసర్‌గా రానుంది. ఈ కొత్త ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్ పాత మోడల్‌తో పోలిస్తే మరింత శక్తివంతమైన పర్ఫామెన్స్ అందిచగలదు. ఫోన్ 8 జీబీ ర్యామ్‌తో రావచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo (మోటరోలా ఎడ్జ్ 50 నియో)
Motorola Edge 50 Neo ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ఈ ఫోన్‌లో కనిపిస్తుంది. MSP నివేదిక ప్రకారం ఈ చిప్‌సెట్‌లో 2.5 GHz క్లాక్ చేయబడిన నాలుగు కోర్స్ ఉన్నాయి. మిగిలిన నాలుగు కోర్లు 2.0 GHz వద్ద క్లాక్ చేయబడ్డాయి. ఈ చిప్‌సెట్ పాత మోడల్‌తో పోలిస్తే మరింత శక్తివంతమైన పనితీరును అందించగలదు. గ్రాఫిక్స్ కోసం Mali-G615 MC2 GPU ఇందులో చూడవచ్చు. ఫోన్ Geekbench జాబితాలో ఇది 8 GB RAMతో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రాబోతోంది.

Motorola ThinkPhone 25 ( మోటరోలా థింక్‌ఫోన్ 25)
మోటరోలా నుండి మరొక ఫోన్ Geekbench లిస్టింగ్‌లో గుర్తించబడింది. Motorola ThinkPhone 25 పేరుతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. దాని స్కోర్‌ల గురించి మాట్లాడితే ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్‌లో 1039 పాయింట్లను స్కోర్ చేసింది. మల్టీకోర్ టెస్ట్‌లో 2833 పాయింట్లు సాధించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కంపెనీ టీజర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 29న విడుదల చేయబోతోంది.

మోటరోలా ఎడ్జ్ 40 నియో 6.55 అంగుళాల ఫుల్ HD ప్లస్ poLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రెండు స్మార్ట్‌ఫోన్‌లలో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉంటాయి. Edge 40 Neo 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 8GB RAM, 128GBతో వస్తుంది. ఈ స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 22999. 12 GB + 256 GB స్టోరేజ్ మోడల్ ధర 24,999 రూపాయలు. పీచ్ ఫడ్జ్ కలర్ కాకుండా ఈ డివైజ్ బ్లాక్ బ్యూటీ, కెనాల్ బే, సాథింగ్ సీ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories